
చలివేంద్రాన్ని ప్రారంభించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్
124 ఆల్విన్ కాలనీ డివిజన్ ఎల్లమ్మబండ పరిధిలో ఉన్న డంపింగ్ యార్డ్ లో నూతనంగా ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ ముఖ్యఅతిధిగా పాల్గొని రాంకీ జోనల్ ఇంచార్జ్ రవి నాయక్ తో కలిసి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ గారు మాట్లాడుతూ ఈ వేసవిలో డంపింగ్ యార్డ్ కార్మికుల మరియు సామాన్య ప్రజల దాహార్తిని తీర్చే చలివేంద్రాలను ఏర్పాటు చేయడం ఎంతో అభినందనీయమని అన్నారు. ఎండలకు ఇబ్బంది పడకుండా తమ యొక్క దాహాన్ని తీర్చుకొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని అందరికి సూచించారు. కార్యక్రమంలో శివరాజ్ గౌడ్, పోశెట్టిగౌడ్, వాసుదేవరావు, వాలి నాగేశ్వరరావు, శివ కృష్ణ, ఎస్.ఆర్.పి గోపాల్ నాయల్, డంపింగ్ ప్రెసిడెంట్ డి.కృష్ణ, ఎం.అంజి, ఏ. జయన్న, జి.ఎస్ మల్లికార్జున, టి.రవీందర్, ఎం.నాగరాజు, ఎం.రంగస్వామి, ఎం.మహేష్, ఎం.నారాయణ, శివ, శ్రీను, జి.ఎచ్.ఎం.సి కార్మికులు తదితరులు పాల్గొన్నారు.
