Spread the love

పరిసరాల పరిశుభ్రత పై అవగాహన ర్యాలీలో పాల్గొన్న కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

ప్రతిఒక్కరు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుతూ చెత్తను రోడ్లపై వేయకూడదని సూచిస్తూ 124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఎల్లమ్మబండలో డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జి.ఎచ్.ఎం.సి శానిటేషన్ ఆఫీసర్ శ్రీనివాస్ రావు (DYEE SWM) మరియు పారిశుధ్య సిబ్బంది తో కలిసి ర్యాలీ నిర్వహించి అవగాహన కల్పించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ ప్రజలందరూ వారి పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని అన్నారు. వారానికి ఒకసారైనా తనిఖీచేసుకుని మీ ఇంటి పరిసరాలలో ఉన్న నీటి నిల్వలను తొలగించాలని అన్నారు. ముఖ్యంగా చెత్తను వీధుల్లోనూ కాలువలోను చెరువుల్లోనూ వేయకుండా తడి చెత్త పొడి చెత్త వేరు చేసి చెత్త సేకరించే ఆటోలలో మాత్రమే వేయాలని సూచించారు. పారిశుధ్య కార్మికులకు సహకరించి, మీ ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకుని రోగాల బారిన పడకుండా చూసుకోవాలని తెలియచేసారు.

కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, పాండుగౌడ్, గుడ్ల శ్రీనివాస్, షౌకత్ అలీ మున్నా, సయ్యద్, అగ్రవాసు, కైసర్, ఇస్మాయిల్, పోశెట్టిగౌడ్, వాలి నాగేశ్వరరావు, మహేష్, ఖలీమ్, రసూల్, రాజ్యలక్ష్మి, సౌందర్య, పుట్టం దేవి,

జి.ఎచ్.ఎం.సి అధికారులు శానిటేషన్ సూపర్వైజర్ మనోహర్ రెడ్డి, ఎస్.ఆర్.పి నాయక్, మల్లేష్, వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.