TEJA NEWS

జి.ఎస్.ఆర్ నగర్లో పర్యటించిన కార్పొరేటర్ వెంకటేష్ గౌడ్

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని ఆల్విన్ కాలనీ ఫేస్ 2 లోని జి.ఎస్.ఆర్ నగర్లో సీసీ రోడ్ల కొరకు నిధులు మంజూరై నిర్మాణ పనులు ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్న రోడ్లను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జి.ఎచ్.ఎం.సి అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ గతంలో కూడా ఈ జి.ఎస్.ఆర్ నగర్ కాలనీకి రోడ్లు, డ్రైనేజీలు, త్రాగు నీరు, వీధి దీపాలు వంటి అన్ని మౌలిక సదుపాయాలు అందించామని గుర్తుచేశారు.

ఇప్పుడు నిర్మిస్తున్న సీసీ రోడ్ల నిర్మాణ పనులు కూడా అతిత్వరలో మొదలుపెడతారని అన్నారు. సీసీ రోడ్డు నిర్మాణ పనులను నాణ్యత ప్రమాణాల విషయంలో రాజీ పడకుండా యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అన్నారు. రోడ్డును మంచిగా లెవెలింగ్ చేసి వర్షపు నీరు నిలిచిపోవడం వంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు ప్రణాళికలతో నిర్మాణ పనులను పూర్తి చేయాలని సంబంధిత అధికారులకు సూచించారు. కార్యక్రమంలో యువనేత దొడ్ల రామకృష్ణ గౌడ్, సమ్మారెడ్డి, అనిల్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, నాగేష్ గౌడ్, సాయి ప్రభాకర్, సాదిక్, రవీందర్, శ్రీధర్, నవీన్, ఏ.ఇ రాజీవ్, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS