TEJA NEWS

Corporator Venkatesh Goud who made a pilgrimage in Vambe Colony

124 డివిజన్ ఆల్విన్ కాలనీ పరిధిలోని వాంబే కాలనీలో రోడ్లు మరియు డ్రైనేజీ లైన్లకు సంబంధించి సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ జి.ఎచ్.ఎం.సి అధికారులు మరియు కాలనీ వాసులతో కలిసి వాంబే కాలనీ మొత్తం పర్యటించి పాదయాత్ర చేస్తూ సమస్యలను స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ వాంబే కాలనీలో కొన్నిచోట్ల బిల్డింగ్ల మధ్యలో నూతన డ్రైనేజీ లైన్ నిర్మించి, ప్రధాన లైన్ కు కలిపి డ్రైనేజ్ సమస్యను పరిష్కరించాలని, అదేవిధంగా త్రాగునీరు సమస్య లేకుండా చూడాలని వాటర్ వర్క్స్ అధికారులకు తెలియచేసారు. కాలనీలో చాలాచోట్ల మట్టికుప్పలు ఉన్నాయని వాటిని తొలగించకుంటే రానున్న వర్షాకాలంలో కుత్బుల్లాపూర్ నుండి వచ్చే వరద నీటితో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది కాబట్టి వెంటనే మట్టికుప్పలను తొలగించే విధంగా చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా కాలనీలో అవసరమైన సీసీ రోడ్ల కొరకు ఎస్టిమేషన్ వేసి ఇవ్వాలని సంబంధిత అధికారులకు సూచించారు. అతిత్వరలో వాంబే కాలనీలోని డ్రైనేజ్ సమస్య పరిష్కరించి, మట్టి కుప్పలు తొలగించి, సీసీ రోడ్లు నిర్మించి, చెట్లు పెట్టి కాలనీని సుందరంగా తీర్చిదిద్దుతానని కార్పొరేటర్ కాలనీ వాసులకు హామీ ఇచ్చారు.

కార్యక్రమంలో జి.ఎచ్.ఎం.సి అధికారులు ఎఇ శ్రావణి, వాటర్ వర్క్స్ మేనేజర్ ఝాన్సీ, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్, ఎస్.ఆర్.పి నాగేశ్వర్ నాయక్, ఎంటమాలజీ సూపర్వైజర్ డి.నరసింహులు, సూపర్వైజర్ శివ, ఎస్.ఎఫ్.ఎ సుదర్శన్ మరియు వెంకట్ రెడ్డి,

కాంగ్రెస్ పార్టీ నాయకులు సమ్మారెడ్డి, శివరాజ్ గౌడ్, వెంకట్ నాయక్, అగ్రవాసు, పోశెట్టిగౌడ్, నరసింహ, సన్యాసిరావు,

వాంబే కాలనీ వాసులు శ్రీలత, రాజు, మునీర్, కె.రవి, గిరి, రాజు, జానీ, యాదయ్య, రవి, విజయలక్ష్మి, సమీరా, ఖాజా బి, ఆశ తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS