TEJA NEWS

Corporator Venkatesh Goud who made a padayatra in Vijay Nagar Colony

124 డివిజన్ పరిధిలోని విజయనగర్ కాలనీలో రోడ్లు మరియు డ్రైనేజీ లైన్లకు సంబంధించి సమస్యలు ఉన్నాయని కాలనీ వాసులు డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ దృష్టికి తీసుకురాగా కార్పొరేటర్ జి.ఎచ్.ఎం.సి అధికారులు మరియు కాలనీ వెల్ ఫెయిర్ అసోసియేషన్ సభ్యులతో కలిసి కాలనీలో పాదయాత్ర చేసి సమస్యలను స్వయంగా పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ విజయనగర్ కాలనీలో కొన్ని డ్రైనేజీలు మరియు సీసీ రోడ్లు గతంలోనే నిర్మించడం జరిగిందని, పెండింగ్ ఉన్న డ్రైనేజీ లైన్లను త్వరలో పూర్తిచేస్తామని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. అలాగే విద్యుత్ వైర్లకు, పారిశుద్ధ్యనికి సంబంధించి మరియు వర్షం నీరు నిల్వవుండడం వంటి సమస్యలను కాలనీ వాసులు కార్పొరేటర్ దృష్టికి తీసుకురావడంతో కార్పొరేటర్ సంబంధిత అధికారులతో మాట్లాడి కాలనీలో ఉన్న సమస్యలను వీలైనంత త్వరలో పరిష్కరించాలని ఆదేశించారు.

కార్యక్రమంలో జి.ఎచ్.ఎం.సి అధికారులు ఎఇ శ్రావణి, వర్క్ ఇస్పెక్టర్ రవి కుమార్, ఎస్.ఆర్.పి నాగేశ్వర్ నాయక్, ఎంటమాలజీ సూపర్వైజర్ డి.నరసింహులు, ఎస్.ఎఫ్.ఎ సుదర్శన్, సూపర్వైజర్ నరేందర్.

విజయనగర్ కాలనీ వెల్ ఫెయిర్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బి.సత్యనారాయణ, వైస్ ప్రెసిడెంట్స్ పి.మురళీకృష్ణ మోహన్ మరియు కె.రఘుపతి రావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ టి.హనుమంత రావు, ట్రెజరర్ ఎం.ఎస్.శ్రీనివాసరావు, జాయింట్ సెక్రటరీస్ ఎం.చంద్రశేఖర్ మరియు పి.శ్రీధర్.

కాంగ్రెస్ పార్టీ నాయకులు శివరాజ్ గౌడ్, వెంకట్ నాయక్, యాదగిరి, బాలస్వామి, పోశెట్టిగౌడ్, రవీందర్, రవి కుమార్, వాలి నాగేశ్వరరావు, భిక్షపతి, రాజ్యలక్ష్మి, శ్రీలత, పర్వీన్, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS