TEJA NEWS

దుర్గగుడిలో ఆగని అవినీతి అక్రమాలు

హిందూ బంధువులు సనాతన ధర్మం నమ్మినవారు ఈ అవినీతి ఆగడాలను అరికట్టాలి…మనమంతా ఏకం అవ్వాలి

కాంట్రాక్టర్లతో కలిసి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్థానం అధికారులు అమ్మవారి ఆదాయానికి గండి కొడుతున్నారు వీళ్లపై చర్య తీసుకుండేలాగా మనం ఉద్యమించాలి….

దేవాదాయ శాఖ మంత్రి కి, ఉప ముఖ్యమంత్రి కి, ముఖ్యమంత్రి కి ఈ విషయాన్ని చేరేంతవరకు సోషల్ మీడియాలో ట్రోల్ చెయ్యాలని ఓ అమ్మవారి భక్తడుగా నా విన్నపం

  • దుర్గమ్మ గుడిలో జరుగుతున్న అవినీతి అరాచకాలను అరికట్టాలి
  • భక్తులను దోచేస్తున్న కాంట్రాక్టర్లపై చర్యలు తీసుకోవాలి
  • భక్తుల్ని దోచేస్తున్నటువంటి కాంట్రాక్టర్లకు సహకరిస్తున్న దేవాలయ అధికారులపై చర్యలు తీసుకోవాలి
  • ఏళ్ల తరబడి దుర్గమ్మ గుడిలో పాతికపోయిన అధికారులు ఒక ముఠాగా చేరి ఈ అక్రమ కాంట్రాక్టర్లకు సహకరిస్తున్నారు
  • గుత్తేదారులు రూల్ వైలేషన్ చేసిన పరవాలేదులే మనవాడే అని వదిలేస్తున్న వైనం.
  • అధికారులుగా దుర్గగుడిలో చలామనవుతున్నటువంటి వ్యక్తులు అమ్మవారికి భక్తులు వేసే మొక్కుబడులు కానుకులే జీతాలుగా ఇస్తున్నారు.
  • కానీ జీతాల రూటు సపరేటు అనే విధంగా దేవస్థానం పై అక్రమ సంపాదనకు శ్రీకారం చుట్టిన అధికారులపై ఎందుకని చర్యలు తీసుకోరు
  • గుత్తేదారుడు కి ఇవ్వవలసినటువంటి కాంట్రాక్టులు ఏవైతే ఉన్నాయో దానిని వేలంపాట నిర్వహించే ముందు ఒక రూల్ విడుదల చేస్తారు
  • ఆ రూలుకు లోబడి గుర్తుదారులు ఈ యొక్క వేలంలో పాల్గొంటారు
  • గుత్తేదారుడు పాల్గొనే అంతవరకు ఈ రూలు ప్రకారం మీరు నడవాలని పలుమార్లు సంబంధిత అధికారులు చెబుతారు
  • పాడుకున్న గుత్తేదారుడు ఎవరైతే ఉన్నారో ఆ గుత్తేదారుడితో ఈ అధికారులు లాలూచీపడి రూల్ వైలేషన్ కి సహకరిస్తారు
  • అసలు రూల్ ప్రకారం పాడుకునటువంటి 72 గంటలలో పాడుకున్న మొత్తము ప్లస్ జీఎస్టీ దేవస్థానానికి కట్టిన పిదప ఆ యొక్క కాంట్రాక్టును గుత్తేదారుడికి అప్పజెప్పాలి.
  • కానీ దేవస్థానంలో జరిగిన మతలబ్ ఏమిటంటే ఈ ముఠాగా చేరినటువంటి అధికారులు కొబ్బరి చిప్పల కాంట్రాక్ట్ ను సెల్ ఫోన్ భద్రపరచు కాంట్రాక్టును రూల్ వైలేషన్ చేసి ఒక సంవత్సరం యొక్క సొమ్ముని రెండు లేక మూడు సార్లు కట్టుకునేటువంటి వెసులుబాటును సంబంధిత గుత్తేదారులకి ఇచ్చారు అన్నది స్పష్టంగా అర్థం అవుతుంది
  • ఈ రూలు వైలేషన్ వల్ల అమ్మవారి ఆదాయముకి ఈ ముఠాగా చేరిన అధికారులు గండి కొడుతున్నారు అని అర్థమవుతుంది
  • మరి ఎందుకనో ఉన్నత స్థాయి దేవాదాయ శాఖ అధికారులు ఈ ముఠాగా చేరినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవడం లేదు తెలియాల్సి ఉంది
  • పలుమార్లు రూల్ వైలేషన్ చేసినటువంటి అధికారులపై చర్యలు తీసుకోవాలని అనేకమంది భక్తులు ఫిర్యాదులు ఇచ్చిన అధికారులు తూతూ మంత్రంగా వారిపై చర్యలు తీసుకున్నట్టు అర్థమవుతుంది

ఈ అవినీతి అధికారుల ముఠా పైన అక్రమ కాంట్రాక్టర్ల పైన దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు గౌరవ రాష్ట్ర ప్రభుత్వం వారు కఠినమైన చర్యలు తీసుకునే వరకు మా పోరాటం కొనసాగుతుంది