TEJA NEWS

ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణస్వామి, శంకర నంద్ మిశ్రాలు
ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

వ్యయ ఖర్చుల లెక్కలు పకడ్బందీగా చేపట్టాలని ఖమ్మం పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల వ్యయ పరిశీలకులు అరుణ్ ప్రసాత్ కృష్ణస్వామి, శంకర నంద్ మిశ్రాలు అన్నారు. నూతన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో సహాయ వ్యయ పరిశీలకులు, అకౌంటింగ్ బృందాలకు ఏర్పాటుచేసిన అవగాహన కార్యక్రమంలో వ్యయ పరిశీలకులు పాల్గొని, అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఎన్నికల్లో ధన, మద్యం, ప్రలోభాల నియంత్రణ కు అన్ని చర్యలు తీసుకోవాలని అన్నారు. లోకసభ ఎన్నికల్లో పోటీచేసే అభ్యర్థికి రూ. 95 లక్షల ఖర్చు పరిమితి ఉందన్నారు. అభ్యర్థి నామినేషన్ వేసినప్పటి నుండి ఖర్చు అభ్యర్థి ఖాతాలో చూపాలన్నారు. ప్రింట్, ఎలక్ట్రానిక్, రేడియో, సోషల్ మీడియా తదితర మాధ్యమాల్లో ప్రచార ఖర్చంతా పరిగణలోకి తీసుకోవాలన్నారు. ర్యాలీలు, సభలు, వాహనాల ద్వారా ప్రచారంపై నిఘాపెట్టాలన్నారు. ప్రచారానికి, వివిధ అనుమతులకు అయిన ఖర్చు అభ్యర్థికి తెలియజేయాలని, ఖర్చు రిజిస్టర్లు అభ్యర్థులు నిర్వహించేలా చర్యలు చేపట్టాలని, అభ్యర్థుల ఖర్చుకు సంబంధించి షాడో రిజిస్టర్లు నిర్వహించాలని వారు అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సహకార అధికారి మురళీధర్ రావు, సహాయ వ్యయ పరిశీలకులు, అకౌంటింగ్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS