TEJA NEWS

ఉధంపూర్ సరిహద్దు ప్రాంతంలో ఎదురు కాల్పులు

జవాన్ వీర మరణం

హైదరాబాద్:
జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్‌లో ఉదయం నుండి భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌లో ఒక ఆర్మీ జవాను వీరమరణం పొందారు.

నిఘా వర్గాల సమాచారం ఆధారంగా.. జమ్మూకశ్మీర్ పోలీసులు ఈరోజు ఉదం పూర్‌లోని బసంత్‌గఢ్‌లో సంయుక్త ఆపరేషన్ ప్రారం భించారు. ఇరు వైపుల నుంచి భారీ కాల్పులు జరుగుతున్నాయి.

ఈ ఎన్‌కౌంటర్ ఉధంపూర్‌ లోని డూడులో జరుగు తోంది. భద్రతా దళాలు ఉగ్రవాదులను చుట్టు ముట్టాయి. పహల్గామ్ ఉగ్రవాద దాడి తర్వాత.. జమ్మూకశ్మీర్‌లో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య గత 24 గంటల్లో జరిగిన మూడవ ఎన్‌కౌంటర్ ఇది.

అంతకుముందు.. కశ్మీర్‌ లోని కుల్గాంలో భద్రతా దళాలు, ఉగ్రవాదుల మధ్య ఎన్‌కౌంటర్ జరిగింది. జమ్మూకశ్మీర్‌లోని అనంత్‌నాగ్ జిల్లా పహ ల్గామ్‌ ప్రాంతంలో ఇటీవల ఉగ్రదాడి చోటుచేసుకున్న విషయం తెలిసిందే.

మంగళవారం పహల్గాంలో సైనిక దుస్తువుల్లో వచ్చిన ఉగ్రవాదులు పురుషులే లక్ష్యంగా కాల్పులు జరిపారు. అమాయకుల ప్రాణాలు తీసి వారి ఉసురు పోసుకున్నారు.

ఈ దాడుల్లో 28 మంది ప్రాణాలు కోల్పోగా.. పలువురు తీవ్రంగా గాయపడ్డారు. మరికొందరు ప్రాణాలతో తప్పించుకు న్నారు. ఈ మారణహో మాన్ని ప్రత్యక్షంగా చూసిన మృతుల కుటుంబాల బాధ వర్ణనాతీతం. అసలైన సైని కులను చూసినా భయంతో వణికిపోతున్నారు.