
జిల్లా జనరల్ ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యలను పరిష్కరించాలని సిపిఎం ధర్నా
నంద్యాల జిల్లా జనరల్ ఆస్పత్రిలో సమస్యలు విలవితాండవం చేస్తున్నాయని, ముఖ్యంగా సిటీ స్కాన్ గత పది రోజులుగా పనిచేయకపోయినా పట్టించుకునే నాధుడే కరువయ్యారని, దీనివల్ల ప్రజల అనేక ఇబ్బందులు పడుతున్నారని సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని ఆస్పత్రి గోడకు అతికించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్, కార్యదర్శి వర్గ సభ్యులు పుల్లా. నరసింహులు, కె. మహమ్మద్ గౌస్, పి. వెంకట లింగం, పట్టణ కమిటీ సభ్యులు మౌలాలి, జైలాన్,లతో పాటు 50మంది కార్యకర్తలు పాల్గొన్నారు.
అనంతరం సిపిఎం పట్టణ కార్యదర్శి లక్ష్మణ్ మాట్లాడుతూ పేరుకే నంద్యాల జిల్లా ఆసుపత్రి అన్ని సమస్యలే ఉన్నాయని, నంద్యాల జిల్లా ఐదు సంవత్సరాలు దాటిన నంద్యాల జిల్లా ఆస్పత్రి సమస్యలు మాత్రం ఎక్కడి వేసిన గొంగళి అక్కడే ఉన్నాయని,ముఖ్యంగా సిటీ స్కాన్ పరికరాలను వెంటనే తెప్పించి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలనిఇక్కడకి వచ్చేది పేద ప్రజలేఅని ఇక్కడ కాకుండా బయటికి వెళ్లాలంటే 10వేలు పెట్టాల్సి వస్తుందని ఖర్చు పెట్టుకునే పరిస్థితి లేదని అన్నారు. ఎమ్,ఆర్,ఐ,సిటీ స్కాన్లలో ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్న రోగులకు కాకుండా,బయట నుంచి వచ్చే రోగులతో వేల రూపాయలు తీసుకొని ఎవరికి తెలియకుండా అవినీతికి పాల్పడుతున్నారని ఆరోపణలు ఉన్నాయని వెంటనే అడ్డుకట్ట వేయాలని, రోజుకు 1000 కి పైగా పెరుగుతున్న రోగులను దృష్టిలో పెట్టుకుని ఓపి సెంటర్లను పెంచాలని,నంద్యాలలో వెంటిలేటర్ తో కూడిన 108 అంబులెన్స్ సర్వీస్ ని ఉండేలాగా చూడాలని,ప్రజల అవసరాలను తీర్చుకునేందుకు వాడుకోవడానికి నీటి వసతిని కల్పించాలని, రేడియాలజీ కి సంబంధించిన ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్లను వెంటనే నియమించేందుకు చర్యలు చేపట్టాలని ,జనరిక్ మందుల షాపును ఆసుపత్రి ఆవరణలోనే ఏర్పాటు చేయాలని, అల్ట్రా సౌండ్ డాక్టర్ ని వెంటనే నియమించాలని,ఖాళీగా ఉన్న 36 మంది అటెండర్ పోస్టులను, ఆస్పత్రిలో 31 పరిమితమై ఖాళీగా ఉన్న సిబ్బంది పోస్టుల ను భర్తీ చేయాలని.ఆసుపత్రికి తగిన రీతిలో పారిశుధ్య సిబ్బందిని నియమించాలి.స్ట్రెచర్, వీల్ చైర్ల కొరత లేకుండా చూడాలి.ప్రతి రూమ్ లో రోగులకు ఇబ్బందులు లేకుండా ఫ్యాన్లను ఏర్పాటు చేయాలని, ఇన్ని రకాల సమస్యలతో ప్రజలు ఇబ్బందులు పడుతుంటే నంద్యాల శాసనసభ్యులు, మరియు మైనార్టీ శాఖ& న్యాయ శాఖ మంత్రివర్యులు ఎన్. ఎమ్. డి. ఫరూక్ గారు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి పై 10 నెలల కాలంలో ఎలాంటి సమస్యలు పరిష్కారం కాలేదని,పట్టించుకోలేదని, ఇప్పటికైనా దృష్టి సారించి ప్రజలకు మెరుగైన ఆరోగ్యం కోసం కృషి చేయాలని జిల్లా జనరల్ ఆస్పత్రి పర్యటన చేసి సమస్యలను పరిష్కారం చేయడం కోసం కృషి చేయాలని,ఆస్పత్రి అభివృద్ధికై పాటుపడాలని అన్నారు. ఈ సమస్యలను వెంటనే పరిష్కారం చెయ్యకపోతే సిపిఎం పార్టీగా ఆందోళనలు మరింత ఉదృతం చేస్తామని హెచ్చరించారు
అభివందనములతో దర్శనం. లక్ష్మణ్ సిపిఎం పట్టణ కార్యదర్శి, నంద్యాల.
