TEJA NEWS

మాజీ మంత్రి పేర్ని నానిపై క్రిమినల్‌ చర్యలు

అమరావతి: మాజీ మంత్రి, వైకాపా కృష్ణా జిల్లా అధ్యక్షుడు పేర్ని వెంకట్రామయ్య (నాని) గోదాములో రేషన్‌ బియ్యం గల్లంతయ్యాయి. రాష్ట్ర పౌరసరఫరాల సంస్థ అద్దెకు తీసుకున్న ఈ గోదాములో దాదాపు రూ.90 లక్షల విలువైన బియ్యం లెక్కలు తేలలేదు. దీనిపై సమగ్ర విచారణ చేయాలని సంస్థ ఎండీ మన్‌జీర్‌ జిలానీ ఆదేశాలు జారీ చేశారు. బియ్యం గల్లంతుపై లెక్కలు తేల్చి రెట్టింపు జరిమానా, గోదాముల యజమానిపై క్రిమినల్‌ చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేశారు. ఆ ప్రకారం నాని దాదాపు రూ.1.80 కోట్లు జరిమానా చెల్లించడంతోపాటు క్రిమినల్‌ కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది.


TEJA NEWS