TEJA NEWS

కలెక్టర్ ని కూడా వదలని సైబర్ నేరగాళ్లు?

వరంగల్ జిల్లా :
దేశంలో సైబర్ నేరగాళ్ల దోపిడి హద్దు అదుపు లేకుండా పోతుంది. దీనిలో భాగంగా వరంగల్ జిల్లా క‌లెక్ట‌ర్ సత్య శారదా పేరుతో సైబ‌ర్ నేర‌గాళ్లు ఫేస్‌బుక్‌లో న‌కిలీ ఖాతా సృష్టించారు.

ఈ ఖాతాను ఉప‌యోగిం చుకుని ప‌లువురి నుంచి డ‌బ్బు వ‌సూలు చేసేందుకు సైబ‌ర్ నేర‌గాళ్లు య‌త్నిస్తు న్నారు. కలెక్టర్ సత్య శారదా మీటింగ్ లో ఉన్నారని అర్జెంట్ గా డ‌బ్బులు కావాలంటూ +94784977145 శ్రీలంక నంబర్‌ నుంచి మెసేజ్ పంపిన సైబ‌ర్ నేరగాడు

డబ్బులు ఫోన్‌పే చేసి, స్ర్కీన్‌షాట్‌ షేర్‌ చేయాలని కోరాడు. ప‌లువురికి మేసేజ్‌లు పంపించారు. దీన్ని గ‌మ‌నించిన క‌లెక్ట‌ర్ సత్య శారదా త‌క్ష‌ణ‌మే పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు.

త‌న అస‌లు ఫేస్‌బుక్ అకౌంట్ ద్వారా అంద‌రిని అప్ర‌మ‌త్తం చేశారు. త‌న పేరుతో ఎవ‌రు డ‌బ్బులు అడిగినా ఇవ్వొద్ద‌ని క‌లెక్ట‌ర్ సూచించారు. పై నంబర్ మోసపూరితమైనది, దయచేసి జవాబు ఇవ్వ కండని కలెక్టర్ సూచించారు.

వీలైనంత త్వరగా బ్లాక్ చేయమని కలెక్టర్ డాక్టర్ సత్య శారదా ప్రతి ఒక్కరినీ కోరారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు సైబర్ కేటుగాళ్ల ఆటకట్టించేందుకు సిద్ధమయ్యారు.


TEJA NEWS