
దండాలయ్య లింగమంతుల స్వామి..
ఆ స్వామి ఆశీస్సులతో ప్రజలంతా సల్లగుండాలి….
లింగమంతుల స్వామి యాదవుల ఆరాధ్య దైవం..
జాతరలు తెలంగాణ సాంస్కృతిక వారధులు…
నీలం మధు ముదిరాజ్..
ఉమ్మడి నల్గొండ జిల్లా సూర్యాపేట నియోజకవర్గం దురాజ్ పల్లిలో జరిగే తెలంగాణ రెండవ పెద్ద జాతరైన పెద్దగట్టు (గొల్లగట్టు) లింగమంతుల స్వామి ని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ స్థానిక నాయకులతో కలిసి దర్శించుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్వాహకులు నీలంకు ఘన స్వాగతం పలికి ఘనంగా సత్కరించారు. అనంతరం నీలం మధు మాట్లాడుతూ తెలంగాణలో నిర్వహించే జాతరలు మన సంస్కృతి సాంప్రదాయాలకు వారధి అన్నారు.
జాతరల తో గ్రామాల్లో ఆధ్యాత్మిక వాతావరణం అలవడంతో పాటు ప్రజల మధ్య ఐక్యమత్యం వెళ్లివిరుస్తుందన్నారు. తెలంగాణలోని రెండవ అతిపెద్ద జాతరైన పెద్దగట్టు(గొల్లగట్టు) లింగమంతుల స్వామి యాదవుల ఆరాధ్య దైవం అన్నారు. డిల్లెం బల్లెం శబ్దాలతో ఓ లింగ నామస్మరణతో తమ వారంతా బాగుండాలంటూ మొక్కులు తీర్చుకుంటారని తెలిపారు. రెండేళ్లకు ఒకసారి ఐదు రోజులపాటు జరిగే ఈ జాతర ఉత్సవాలను ప్రజలంతా ఆనంద ఉత్సవాల మధ్య జరుపుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఆ స్వామి వారి ఆశీస్సులతో తెలంగాణ ప్రజలంతా సుఖ సంతోషాలు ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు Dr రామ్మూర్తి యాదవ్, MEPA రాష్ట అధ్యక్షులు పులి దేవేందర్,తుంగతుర్తి నియోజకవర్గం యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్,MEPA జిల్లా అధ్యక్షులు కోల కరుణాకర్, అశోక్, లింగన్న, ప్రసాద్,నరేష్,మహేష్,మనోహర్, వినయ్, కోటి, వికాస్, ఉత్సవ నిర్వహకులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు.
