
మాల కొండయ్య కు ఘనంగా నివాళులర్పించిన దారపనేని
కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం తూర్పు కోడిగుడ్లపాడు పంచాయితీ పోతవరం గ్రామ టిడిపి నాయకులు, ఒంగోలు వెంగమాంబ ఆటో ఫైనాన్స్ అధినేత చెనికల మాలకొండయ్య (50 చిన్నోడు) ఆకస్మిక మృతి పట్ల కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మాలకొండయ్య మృతి తీరని లోటు అని మాలకొండయ్యకు దారపనేని ఘనంగా నివాళులు అర్పించారు. మాల కొండయ్య సతీమణి, కుమారుడు మనోహర్ కు దారపనేని మనోధైర్యం కల్పించారు. టిడిపి రాష్ట్ర బీసీ సెల్ ఉపాధ్యక్షులు మోరు బోయిన గంగరాజు యాదవ్, గిడ్డయ్య యాదవ్, మోపాడు నీటి సంఘం చైర్మన్ నరసింహారావు యాదవ్, మోహన్ రావు యాదవ్, కొండయ్య యాదవ్, తూర్పు కోడిగుడ్లపాడు మాజీ ఎంపీటీసీ చెనికల పెదమాల కొండయ్య, చిన్న మాల కొండయ్య, కొండయ్య (కరణం) నాగేశ్వరరావు, శ్రీనివాసులు, మానం మల్లికార్జునరావు, తిరివీధి కేశవులు (కర్నూలు) ఖాజా, గోళ్ళ రమణయ్య (వైజాగ్) నూతలపాటి బాలయ్య, మానం నాగమల్లేశ్వరరావు, తోడేందుల వెంకటేశ్వర్లు చెనికల నాగయ్య, సుధాకర్ రెడ్డి, తదితరులు నివాళులు అర్పించిన వారిలో ఉన్నారు.
