
మిరియం వారి వివాహ వేడుకల్లో పాల్గొన్న దారపనేని
కనిగిరి
కనిగిరి నియోజకవర్గం పామూరు మండలం తూర్పు కోడిగుడ్లపాడు పంచాయతి పరిధిలోని పోతవరం గ్రామ వాస్తవ్యులు మిరియం సుబ్బరాయుడు శ్రీమతి వైదేహి దంపతుల కుమారుడు చిరంజీవి వెంకటేష్, కడప జిల్లా పోరుమామిళ్ల మండలం కమ్మవారిపల్లె గ్రామ వాస్తవ్యులు చెరుకూరి చెన్నకేశవులు శ్రీమతి లక్ష్మీదేవి దంపతుల కుమార్తె చరిత ల వివాహ వేడుకలు రాత్రి గుంటూరు పట్టణంలోని కొమ్మినేని గార్డెన్స్ నందు అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ వివాహ వేడుకల్లో కనిగిరి మాజీ ఏఎంసీ చైర్మన్ దారపనేని చంద్రశేఖర్ పాల్గొని వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ వివాహ వేడుకల్లో తూర్పు కోడిగుడ్లపాడు మాజీ సర్పంచ్ దారపనేని జనార్దన్ రావు అండ్ బ్రదర్స్, మిరియం, గురువయ్య, నాగినేని రమేష్ బాబు, మోపాడు తెలుగుదేశం పార్టీ నాయకులు గుర్రం వెంకటేశ్వర్లు, మిరియం వారి కుటుంబ సభ్యులు, చావ వారి కుటుంబ సభ్యులు, చెరుకూరి వారి కుటుంబ సభ్యులు , బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో పాల్గొని వధూవరులను అక్షింతలతో ఆశీర్వదించి వివాహ శుభాకాంక్షలు తెలిపారు.
