
బలహీన వర్గాలకు న్యాయం చెయ్యాలని కోరిన దయానంద్ ముదిరాజ్
వనపర్తి నియోజకవర్గ కంటెస్టెడ్ స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్ధి
వనపర్తి
రాష్ట్ర ప్రభుత్వం కుల గణన సర్వే చెయ్యడం అభినoదనీయo వనపర్తి నియోజకవర్గ కంటెస్టెడ్ స్వతంత్ర అభ్యర్థి దయానంద్ ముదిరాజ్ పత్రికా ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరారు 2014 సమగ్ర కుటుంబ సర్వే లో చేసినప్పుడు బి సి సామాజిక వర్గ ప్రజలు 51% ఉన్నది .
ప్రస్తుత సర్వే లో 46% కి ఎలా తగ్గిందని బీసీ ప్రజలకు సమాధానం చెప్పవలసిన అవసరం ఉందని రాష్టం లో 96.9% సర్వే జరిగిందని ప్రభుత్వ ప్రజానిదులు తెలుపుతున్నారు.
150 ఇండ్లకు 10 మంది ఎమ్యూనలేటర్ ఒక అబ్జర్వర్ ఏర్పాటు చేసి 50 రోజుల సర్వే చేసి ప్రజల ముందు ఉంచారని ఇందుకు కష్టపడిన అధికారులను అభినందించాల్సిన అవసరం ఉందని తెలుపుతూ సర్వే ఏదైనా రాష్టం లో ముదిరాజ్ బిడ్డలు అత్యాధీకమనీ సమాచారం.
సర్వే అనంతరం బీసీ ప్రజల పక్షాన మాట్లాడిన నాయకులకు బీసీ ప్రజలు అండగా ఉంటారని బీసీ ప్రజల్లో సంఖ్య తగ్గడాని గల కారణాలపై పున: పరిశీలించి బలహీన వర్గాలకు న్యాయం చేయాలని కోరారు…
సర్వే ద్వారా బీసీ ప్రజల ఆర్థిక స్థితి గతులను ఏ విధంగా మార్చబోతున్నారో .
ఎలాంటి ప్రణాళికలు రూపొందించి కుల సామాజిక, ఆర్థిక, విద్యా, ఉద్యోగ, రాజకీయ రంగాలలో న్యాయం చేయాలని కోరారు.
