TEJA NEWS

రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకల ను ఘనంగా జరిపిన డీసీసీబీ మల్లి బాబు యాదవ్

ఉమ్మడి ఖమ్మం

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 55వ జన్మదిన వేడుకలను కామేపల్లి మండలం పండితాపురం గ్రామంలో ఖమ్మం జిల్లా డీసీసీబీ డైరెక్టర్ మల్లిబాబు యాదవ్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా
కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, భారీ ఎత్తున పాల్గొని నినాదాలు చేస్తూ స్వీట్లు పంచుకుని బాణా సంచాకాల్చారు. ఈ
సందర్భంగా మల్లి బాబు యాదవ్ మాట్లాడుతూ గత బి.ఆర్.ఎస్ ప్రభుత్వం
ఏడు లక్షల కోట్ల అప్పుచేసి, తెలంగాణను అప్పుల తెలంగాణగా మార్చినప్పటికీ, 10 సంవత్సరాల పాటు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని లేకుండా చేయాలని, కుట్రలు చేసినప్పటికీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరిని ఏకం చేసి పార్టీని గెలిపించారని,కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎన్నికలప్పుడు ఇచ్చిన మాట ప్రకారం ఆరు గ్యారెంటీ పథకాల ను విజయవంతంగా కేవలం 11 నెలల్లోనే అమలు చేసి తెలంగాణ ను ప్రగతివైపు నడిపిస్తూ ప్రతిపక్షాలకు చెమటలు పట్టిస్తున్న ఘనత రేవంత్ రెడ్డికి దక్కింది అన్నారు.

ఉన్నత విద్య చదివి కేవలం జడ్పిటిసి స్థాయి నుండి క్రమశిక్షణతో రాజకీయాలలో ఉన్నత స్థాయికి ఎదిగి ఈరోజు ముఖ్యమంత్రి కావడం చాలా గొప్ప విషయమని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ కె ఫతే మహమ్మద్, ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర అధ్యక్షులు అజ్మీర సుశీల, బానోత్ నరసింహ నాయక్, చల్ల మల్లయ్య, మేకల మల్లికార్జునరావు, ఎస్.కె రబ్బాని పాషా, అంబడిపూడి సత్యం, మేకల మహేష్ బాబు, , గుగులోతు రవి, భూక్య నాగేంద్రబాబు పాడిబండ్ల ప్రసాదు, భుక్యా సుమన్ జక్కంపూడి వెంకటేశ్వర్లు, చింతల వెంకయ్య, బద్దల రాజేష్ రాయల నాగ శంకర్, గుగులోతు చింటూ, భానోత్ వీర నాగులు, దాసరి గురేష్, పల్లె వెంకట్రాములు,మామిళ్ళ చిన్న నర్సయ్య, చిరుమర్తి నాగరాజు, నాగండ్ల జగ్గయ్య మరియు తదితరులు పాల్గొన్నారు


TEJA NEWS