ఐదు రూపాయల భోజన పథకం ఏర్పాటు చేయాలని దీక్ష
*వనపర్తి :
వనపర్తి జిల్లా ప్రధాన కూడళ్లలో ప్రభుత్వం ఐదు రూపాయల భోజన పథకం ఏర్పాటు చేయాలని తెలంగాణ దళిత రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో రాజీవ్ చౌరస్తాలో దీక్షను నిర్వహించడం జరిగింది ఈ సందర్భంగా తెలంగాణ దళిత రిజర్వేషన్ పోరాట సమితి రాష్ట్రస్థాపక అధ్యక్షుడు గంధం సుమన్ మాట్లాడుతూ వనపర్తి జిల్లా కావడంతో వివిధ అవసరాల కోసం జిల్లా కేంద్రానికి ప్రతినిత్యం పేదలు ఉదయం వచ్చి సాయంకాలంవెళ్తుంటారని ఈ క్రమంలో వందల రూపాయలు వెచ్చించి హోటల్లో భోజనం చేసే స్తోమత లేని నిరుపేదలు ఖాళీ కడుపులతో తిరిగి వారి గ్రామాలకు వెళుతుంటారని ఈ పరిస్థితిని స్థానిక ప్రజాప్రతినిధులు ప్రభుత్వ అధికారులు స్పందించి జిల్లా కేంద్రంలోని పలు కూడళ్ళలో భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు రాష్ట్రంలోపలుచోట్ల ఐదు రూపాయల భోజన పథకం నడుస్తున్నదని ఇక్కడ కూడా త్వరగా ప్రారంభిస్తే నిరుపేదల ఆకలిని తీర్చడం జరుగుతుందని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షులు బండి అజయ్ మాదిగ శరత్ చంద్ర దాస్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
ఐదు రూపాయల భోజన పథకం ఏర్పాటు చేయాలని దీక్ష
Related Posts
ఫీజు రీయంబర్స్మెంట్ జాప్యానికి కళ్ళకు నల్ల గంతలతో ఏఐఎస్ఎఫ్ నిరసన
TEJA NEWS ఫీజు రీయంబర్స్మెంట్ జాప్యానికి కళ్ళకు నల్ల గంతలతో ఏఐఎస్ఎఫ్ నిరసన వనపర్తి రాష్ట్రంలోరూ. 7800 కోట్లకు పైగా ఉన్న విద్యార్థ పెండింగ్ ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలనువెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణం అంబేద్కర్…
జర్నలిస్ట్ గాంధీ తండ్రి మృతి బాధాకరం…
TEJA NEWS •జర్నలిస్ట్ గాంధీ తండ్రి మృతి బాధాకరం… సూర్యాపేట జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్ గౌడ్.. కోదాడ సూర్యాపేట జిల్లాఏబీఎన్ సీనియర్ రిపోర్టర్ పిడమర్తి గాంధీ తండ్రి పుల్లయ్య అనారోగ్యంతో మృతి చెందడం బాధాకరమని సూర్యాపేట జిల్లా…