TEJA NEWS

Delhi High Court stays Kejriwal's bail order

కేజ్రీవాల్ బెయిల్ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే

న్యూ ఢిల్లీ :
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ బెయిల్ ఉత్తర్వు లపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది.

కేజ్రీవాల్‌కు బెయిల్ ఇవ్వ డాన్ని సవాల్ చేస్తూ ఇడి హైకోర్టుకు వెళ్లింది. ట్రయల్ కోర్టు ఇచ్చిన బెయిల్ ఉత్తర్వులపై ఢిల్లీ హైకోర్టు స్టే విధించింది. ఇడి పిటిషన్‌పై విచారణ పూర్తయ్యే వరకు బెయిల్ ఇవ్వకూడదని కోర్టు తెలిపింది.

ఢిల్లీ మద్యం స్కామ్ సంబంధిత మనీలాండరింగ్ కేసులో ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.

ప్రత్యేక న్యాయమూర్తి నియాయ్ బిందు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ దశలోనే ఎన్‌ఫోర్స్‌ మెంట్ డైరెక్టరేట్ (ఇడి) ఈ బెయిల్ ఆదేశాలను కనీసం 48 గంటల పాటు నిలిపి వేయాలని, తాము ఎగువ కోర్టుకు వెళ్లేందుకు వీలు కల్పించాలని వేడుకుంది.

అయితే ఈ అభ్యర్థనను ప్రత్యేక న్యాయమూర్తి తోసిపుచ్చారు. కేజ్రీవాల్ రూ 1 లక్ష పూచీకత్తుతో విడు దలకు ఆదేశించిన కోర్టు కొన్ని షరతులు విధించిన విషయం విధితమే..


TEJA NEWS