TEJA NEWS

ఛట్ పూజలో ముఖ్య అతిధిగా పాల్గొన డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్

నిజాంపేట్ మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో 7వ డివిజన్ ఎన్టీఆర్ నగర్ కాలనీ వాసుల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఛట్ పూజలో ముఖ్య అతిధిగా డిప్యూటీ మేయర్ ధనరాజ్ యాదవ్ పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్బంగా డిప్యూటీ మేయర్ మాట్లాడుతూ బీహార్, జార్ఖండ్ మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, ఛత్తీస్గఢ్, చండీగఢ్, గుజరాత్, గయ, రాంచీ, ఢిల్లీ, ముంబై తదితర ప్రాంతాల్లో ప్రముఖంగా కార్తీకమాసంలో జరుపుకునే పూజ ఛట్ పూజ. ఛట్ పూజను దళ ఛట్, ఛతి, సూర్య షష్ఠి అని కూడా అంటారు. మన ప్రాచీన పండుగల్లో ఛట్ పూజ ఒకటి. భూమ్మీద తమకు మనుగడ కల్పిస్తున్న సూర్యభగవానుడికి కృతజ్ఞతలు చెప్పుకుంటూ, ఆయురారోగ్య, ఆనందాలను ప్రసాదించమని ప్రార్ధిస్తారు. సూర్యుని ఆరాధించడంవల్ల కుష్టు వంటి దీర్ఘకాలిక వ్యాధులు కూడా
నయమౌతాయని నమ్ముతారు.

పవిత్ర నదిలో పుణ్యస్నానం చేసి నీటిలో వీలైనంత ఎక్కువసేపు నిలబడి సూర్యభగవానుని ఆరాధిస్తారు. దీపాలు వెలిగించి పండ్లు, ఫలాలు ప్రసాదంగా సమర్పిస్తారు.ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నాగరాజ్ యాదవ్,191 ఎన్టీఆర్ కాలనీ ఛట్ పూజ నిర్వాహకులు రాజేష్, జితేంద్ర, శంభు, ఓం ప్రకాష్ 191 ఎన్టీఆర్ నగర్ ప్రెసిడెంట్ కృష్ణ , జనరల్ సెక్రెటరీ శ్రీనివాస్ రెడ్డి, ఉపేందర్, మధు, నర్సింహా నాయక్, శేఖర్ చిన్ను , నాగి రెడ్డి, కాలనీ వాసులు, తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS