అయోధ్యలో శ్రీరాముడి దర్శనం కోసం భక్తులు భారీగా ఎగబడ్డారు. దీంతో స్వల్ప తొక్కసలాట జరిగి ఒక భక్తుడు గాయపడ్డాడు. మరోవైపు, మంగళవారం మధ్యాహ్నానికి రామ్లల్లాను రెండు లక్షల మంది దర్శించుకున్నారని అధికారులు తెలిపారు..
అయోధ్య రామయ్య దర్శనం కోసం భక్తులు పోటెత్తారు. మంగళవారం అర్ధరాత్రి నుంచే భక్తులు రామ్లల్లా దర్శనం కోసం క్యూ కట్టారు. అలా మంగళవారం మధ్యాహ్ననానికి వేలాది భక్తులు రామాలయ ప్రధాన ద్వారం వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో రామాలయం రోడ్లన్ని భక్తులతో నిండిపోయాయి. దీంతో భక్తులను అదుపు చేసేందుకు భద్రతా సిబ్బంది తీవ్ర అవస్థలు పడ్డారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని రామమందిరం వెలుపల మరింత భద్రతను పెంచారు అధికారులు.