TEJA NEWS

శ్రీ చక్ర అమ్మవారి ఆలయానికి భక్తులు తాకిడి
అమ్మవారి దర్శనానికి సుదూర ప్రాంతాల నుండి విచ్చేసిన భక్తులు*
అమ్మవారికి అభిషేకాలు కుంకుమ పూజల నిర్వహణ*

కొత్తపేట… మండల పరిధిలోని ఏనుగులమహల్ గ్రామంలో వేంచేసియున్న శ్రీ చక్ర మహామేరు యంత్రాలయం నందు శ్రీ చక్ర అమ్మవారికి అత్యధిక సంఖ్యలో భక్తులు అభిషేకాలు,కుంకుమ పూజలు నిర్వహించారు. అమ్మవారికి ప్రీతికరమైన రోజు కావడం అలాగే జేష్ఠ అమావాస్య రావడంతో సుదూర ప్రాంతాల నుండి వచ్చి అమ్మవారిని విశేష సంఖ్యలో దర్శించుకున్నారు.దేశంలోనే అతి పెద్ద శ్రీ చక్రం ఈ ఏనుగుల మహల్ గ్రామంలో మాత్రమే ఉంది.అందుచే భక్తులు ఈ చక్ర అమ్మవారి దర్శనానికి మన రాష్ట్రం నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి కూడ వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు..


TEJA NEWS