Spread the love

శ్రీశైలంకు పాదయాత్రగా వెళ్ళే భక్తులకు అన్నదాన కార్యక్రమం….

అన్నదాన కార్యక్రమాన్ని గ్రామస్తులతో కలిసి ప్రారంభించిన జోగులాంబ గద్వాల జిల్లా బిఆర్ఎస్ పార్టీ నాయకులు
బాసు హనుమంతు నాయుడు

ఈరోజు గద్వాల నియోజకవర్గం గట్టు మండలం బల్గెర గ్రామంలో శ్రీశ్రీశ్రీ దిగంబరస్వామి దేవస్థానం నందు ఉగాది పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం మల్లికార్జున స్వామి దర్శనానికి పాదయాత్రగా వెళ్ళే కర్ణాటక భక్తులకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు… ఆ అన్నదాన కార్యక్రమాన్ని గ్రామస్తులతో కలిసి బాసు హనుమంతు నాయుడు ప్రారంభించి, భక్తులకు తనే స్వయంగా వడ్డించారు… అంతక ముందు,శివుని చిత్రపటానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు…

— ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…

దైవకృపతో భక్తులకు సేవ చేయడం ఎంతో సంతోషాన్ని ఇస్తుందన్నారు. భక్తులకు అన్నదానం ఏర్పాటుచేయడం ఆత్మసంతృప్తిని కలిగిస్తుందన్నారు.భక్తులు పాదయాత్ర ప్రశాంతంగా సాగాలని దేవుడ్ని కోరారు.

ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు తదితరులు పాల్గొన్నారు..