TEJA NEWS

ముందస్తు జాగ్రత్తలతోనే ఇబ్బందులు తప్పాయి.
నగర శుభ్రతకు ప్రతి ఒక్కరూ సహకరించాలి.*
కమిషనర్ ఎన్.మౌర్య*

సాక్షిత తిరుపతి : ముందస్తు జాగ్రత్తలు తీసుకోవడం, అందరూ కలిసికట్టుగా పని చేయడంతో తుఫాన్ ను సమర్థవంతంగా ఎదుర్కొనగలిగామని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చేయగలిగామని నగరపాలక సంస్థ కమిషనర్ ఎన్.మౌర్య అన్నారు. లోతట్టు ప్రాంతాలైన పూలవానిగుంట, కొరమేనుగుంట, ఆటోనగర్ ప్రాంతాల్లో ప్రజలకు అందుతున్న సహాయక చర్యలను, పునరావాస కేంద్రాలను గురువారం ఉదయం అధికారులతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఎన్.మౌర్య మాట్లాడుతూ తుఫాను ప్రభావంతో గత రెండు రోజులుగా 30 ఎం.ఎం. వర్షపాతం నమోదయిందని అన్నారు. అదేవిధంగా కొండలపై నుండి ఎక్కువ నీరు రాకపోవడంతో కొంతమేర ఇబ్బందులు తప్పాయని అన్నారు. నెల రోజుల ముందుగానే నగరంలోని ప్రధాన కాలువల్లో చెత్త చెదారం, మట్టి తదితరాలను జెసిబి లతో తొలగించాలని అన్నారు. దీంతో ఎక్కడా నీరు రోడ్లపైకి రాకుండా సజావుగా వెళ్ళిపోయాయని అన్నారు.

లీలామహల్ కూడలి, కరకంబాడి మార్గం ప్రాంతాల్లో రోడ్లపై రాకుండా నీటి వినాయక సాగర్ మళ్లించామని అన్నారు. అలాగే లోతట్టు ప్రాంతమైన కోరమేనుగుంట లోకి నీరు ఎక్కువ రాకుండా కచ్చా డ్రెయిన్ ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే లక్ష్మీపురం కూడలి, అండర్ బ్రిడ్జి కింద నీరు చేరిన వెంటనే మోటార్ల సాయంతో ఎప్పటికప్పుడు నీరు తొలగించమని అన్నారు. దీంతో ఎక్కడా నీరు నిలవలేదని అన్నారు. నుండి వర్షాలు తగ్గడంతో పారిశుద్ధ్య పనులు విస్తృతంగా చేపట్టామని అన్నారు. అన్ని ప్రాంతాల్లో బ్లీచింగ్ చల్లడం, పాగింగ్ చేయడం చేస్తున్నామని అన్నారు. అలాగే త్రాగునీరు కలుషితం కాకుండా తగు చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి రోజూ క్లోరినేషన్, నీటి సాంద్రత పరీక్షలు చేసి సరఫరా చేస్తున్నామని అన్నారు. ముఖ్యంగా డ్రెయినేజీ కాలువలపైన నిర్మాణాలు చేయడం వలన ఇబ్బందులు వస్తున్నాయని అన్నారు. వాటిని తొలగిస్తామని అన్నారు. అలాగే కాలువల్లో పాడైన బెడ్లు, డైపేర్స్, చెత్త వేయడం వలన నీరు రోడ్లపైకి వస్తున్నాయని అలా వేయవద్దని ప్రజలను కోరారు. కమిషనర్ వెంట సూపరింటెండెంట్ ఇంజినీర్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్లు తులసి కుమార్, గోమతి, సి.పి.ఓ. దేవి కుమారి, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, రెవెన్యూ ఆఫీసర్స్ సేతు మాధవ్, రవి, డి. ఈ.లు, తదితరులు ఉన్నారు.


TEJA NEWS