రాష్ట్రంలో అస్తవ్యస్తంగా విద్యావ్యవస్థ
*
- పుడ్ పాయిజన్స్ తో విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్న ప్రభుత్వం
- ఫుడ్ పాయిజన్ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలి.
- వామ పక్ష విద్యార్థి సంఘాల ఆద్వర్యంలో విద్యాసంస్థలు బంద్ విజయవంతం. వనపర్తి
రాష్ట్రంలో రోజురోజుకు ప్రభుత్వ పాఠశాలల్లో పుడ్ ఫాయిజాన్ కేసులు వెలుగుచూస్తున్న ప్రభుత్వం కనీసం స్పందించడం లేదని ఎస్ఎఫ్ఐ వనపర్తి జిల్లా కార్యదర్శి ఎం.ఆది, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నరేష్, పి డి ఎస్ యు నాయకులు గణేష్ వెంకటేష్ మండిపడ్డారు. శనివారం రాష్ట్రవ్యాప్తంగా వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ప్రభుత్వ పాఠశాలల బందులో భాగంగా వనపర్తి జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థల బందు చేసి నిరసన వ్యక్తం చేయడం జరిగింది.
ఈ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాల నేతలు మాట్లాడుతూ… రాష్ట్రంలో విద్యా వ్యవస్థ పై ముఖ్యమంత్రి రివ్యూ చేసి ఈ తరహా ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.రాష్ట్రంలో ఫుడ్ పాయిజన్ తో ఇప్పటికీ నలుగురు విద్యార్థులు మృతి చెందగా,920 మంది ఫుడ్ పాయిజన్ తో ఆస్పత్రి పాలైనరన్నారు. రాష్ట్రంలో నాసిరకం బియ్యం నిత్యవసర వస్తువులు అందించకుండా అధికారులు తనిఖీలు చేపట్టాలని,పెరిగిన ధరలను అమలు చేస్తూ నాణ్యమైన పౌష్టికాహారం అందించాలని విద్యార్థి సంఘాల నేతలు డిమాండ్ చేశారు.రాష్ట్ర ప్రభుత్వం స్పందించకుంటే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలకు పిలుపునిస్తామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు వీరన్న నాయక్, నీలోత్పల్ ,భరత్ , మోహన్, శ్రీకాంత్,ఆంజనేయులు కార్తీక్, హరీష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు నరేష్, పి డి ఎస్ యు విద్యార్థి సంఘాల నేతలు పాల్గొన్నారు.