మళ్ళీ వాయిదా పడ్డ నామినేటెడ్ పదవుల పంపకం!!!!!!! అంతా రామ మాయం.. జగమంతా రామమయం లా.. అంతా నామినేటెడ్ పదవులు పంపకం, వాయిదాలపై, వాయిదాల మయం.. పంపకాలు వాయిదాలపై, వాయిదాలు పడుతూనే వున్నాయి.. ఇటీవల పదవుల పంపకం పై సీఎం చంద్రబాబు నోరు తెరిచారు.. త్వరలో నామినేటెడ్ పదవుల పంపకం జరుగుతుందని.. ఆచరణలో మాత్రం కన్పించటం లేదు.. మాటలు కోటలు దాటుతున్నాయి.. చేష్టలు గడప కూడా దాటటం లేదని, టీడీపీ నాయుకులు, కార్యకర్తలు వాపోతున్నారట..ఎప్పుడూ ఎదొక అడ్డంకి ఎదురవుతూనే వుంది.. ఈ నామినేటెడ్ పదవుల పంపకం, సీఎం చంద్రబాబు నుండి చెజారి పోయి మంత్రి లోకేష్ చెంతకు చేరాయి.. చిన్న సార్ కు తెలియకుండా, పెద్ద సార్ చేయలేరు.. చిన్న సార్ గారేమో, నాదేముంది, అంతా సీఎం చంద్రబాబు దే అంటుంటారు. కానీ చిన్న సార్ కు తెలియకుండా, ఆయన సిపార్సులు లేకుండా, నామినేటెడ్ పదవులు, ముందుకు వెళ్లవని, టీడీపీ నాయుకులందరికి తెలుసు. మొక్కుబడిగా కొన్ని నామినేటెడ్ పదవుల పంపకం జరిగినా, అసలు పదవుల పంపకం, ఇంకా ప్రారంభించలేదు.. మంత్రి నారా లోకేష్ విదేశ పర్యటన లో వున్న నేపథ్యంలో, నామినేటెడ్ పదవుల పంపకం వాయిదా పడ్డాయట.
. ఆయన అందుబాటులో వున్నప్పుడు పదవుల పంపకం ఎందుకు ప్రారంభించలేదు అన్న ప్రశ్నకు సమాధానం ఉండదు.. నామినేటెడ్ పదవుల పంపకంలో, సీఎం చంద్రబాబు కి, ఏ కారణాలతో ఇష్టముండదో కానీ, అప్పుడు.. ఇప్పుడు అదే కాలయాపన.. ఏయే కారణాలతో నామినేటెడ్ పదవుల పంపకం నిలిచిపోయింది.. దీని వెనుకున్న, సూత్రదారులు, పాత్రదారులు ఎవ్వరో టీడీపీ నేతలందరికి తెలుసు.. అయినా ఎవ్వరూ బయటపడరు.. ఒక వేళ బయటపడితే, అసలుకే ఎసరు అవుతుందని నాయుకులు కు భయం.. పదవుల పంపకం విషయంలో, జాప్యం జరుగుతున్నా, మమ్ములను ఎవరూ నీలాదీయరన్న ధీమా, సీఎం చంద్రబాబు, మంత్రి లోకేష్ లలో ఉందేమో.. మొదటి నామినేటెడ్ పదవుల పంపకలో సీనియర్ నాయుకుల పేరు కన్పించ లేదు.. వారి పేర్లు కూడా విన్పించటం లేదు.. ఇంత కు నామినేటెడ్ పదవుల, రెండో విడత పంపకం ఇప్పట్లో ప్రారంభం అయ్యే పరిస్థితులు కానుసూపుమేర కన్పించటం లేదు..