
ప్రైవేట్ ఆస్పత్రులను ఆకస్మిక తనిఖీ చేసిన డిఎంహెచ్వో కోటాచలం
సూర్యపేట జిల్లా : సూర్యపేట జిల్లా కేంద్రంలోని పలు ప్రైవేట్ హాస్పిటల్లో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ కోటాచలం శనివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. పలు హాస్పిటల్ లో వైద్యులు లేకుండానే ఆసుపత్రులు నిర్వహిస్తున్నట్లు సమాచారంతో తనిఖీ నిర్వహించారు. హాస్పిటల్స్ లో రిజిస్ట్రేషన్ సమయంలో ఇచ్చిన సమాచారం ప్రకారం హస్పిటల్ నిర్వహణ, వైద్యులు, వైద్య సేవలు ప్రజలకు అందుబాటులో ఉన్న సమయాలు వారి యొక్క వ్యాలిడిటీ సర్టిఫికెట్స్ మొదలైన వాటిని పరిశీలించారు. వైద్య ఆరోగ్యశాఖ సూచన మేరకు తగు సలహాలు సూచనలు హెచ్చరికలు చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ బృందం ఎన్ హెచ్ ఎం పిఓ డాక్టర్ అనిత, ఏవో డాక్టర్ శ్రీశైలం, డిప్యూటీ డెమో మనోహర రాణి, ఎస్ ఓ వీరయ్య, సిసి రవితేజ తదితరులు ఉన్నారు.
