Spread the love

రక్తదానం చేయండి ప్రాణదాతలుగా నిలవండి..


కోదాడ సూర్యాపేట జిల్లా): అన్ని దానాల కన్నా గొప్పదనం రక్తదానం, రక్తదానం చేయండి మరి ఒకరికి ప్రాణదా తలుగా నిలబడండి అని ఎంబిఎం ట్రస్టు సభ్యులు అన్నారు.శనివారం కోదాడ విజయ సాయి దుర్గ హాస్పిటల్ లో కలకొండ స్వరూప కాపుగల్లువారికి అత్యవనగరంగా ఓ పాజిటివ్ బ్లడ్ అవసరం అని డాక్టర్ చెప్పడంతో తెలుసుకున్న ఎంబిఎం గ్రూప్ సభ్యులైన కోదాడ లక్ష్మీపురం కు చెందిన నత్య టీవీ న్యూస్ రిపోర్టర్ షేక్ అబ్దుల్ రహి ముద్దిన్ వారికి బ్లడ్ ఇచ్చి ప్రాణదాతగా నిలిచారు.ఈ సందర్భంగా గ్రూపు నభ్యులు మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా ఇప్పటి వరకు ఎంతోమందికి రక్తాన్ని అందించి ప్రాణదాతగా నిలుస్తున్నా మని తెలిపారు.రాబోయే రోజులలో ఈ ట్రస్టు ద్వారా ఎంతోమందికి రక్తం అందించడానికి నహకరిస్తున్న గ్రూపు సభ్యులకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేశారు.షేక్ అబ్దుల్ రహి ముద్దిన్ ఇప్పటివరకు ఎంబీఏం ట్రస్టు ద్వారా 27 సార్లు బ్లడ్ ఇవ్వడం జరిగిందని వారికి ఎంబిఎం ట్రస్టు సభ్యుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఇప్పటివరకు ఈ ట్రస్ట్ కు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ట్రస్టు తరఫున ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంబిఎం ట్రస్ట్ సభ్యులు మణికంఠ,ట్రస్ట్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.