విద్యుత్ సరఫరా పునరుద్ధరణ తో హర్షం వ్యక్తం చేసిన ప్రజలు
విద్యుత్ శాఖ స్టేట్ ఇంజనీర్ రవికుమార్
తిరుమలాయపాలెం మండల పరిధి లోని గోల్ తండా పాతర్లపాడు ఎస్సీ కాలనీ గోపాయిగూడెం జోగులపాడు ఆయా గ్రామాల్లో వీసిన ఈదురు పెనుగాలుల తో కూడిన అకాల వర్షం కురవడం తో చాలాచోట్ల భారీ వృక్షాలు, కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డాయి. దీంతో గోపాయిగూడెం పాతర్లపాడు గోల్ తండా గ్రామాలలో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. బుధవారం విద్యుత్ శాఖ అసిస్టెంట్ ఇంజనీర్ రవికుమార్ తమ సిబ్బందితో హుటాహుటిన అక్కడికి చేరుకొని విద్యుత్ సరఫరా పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమయ్యారు.ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేసి ఆయా గ్రామాలకు విద్యుత్ సరఫరా చేయడం తో స్థానిక ప్రజలు హర్షం వ్యక్తం చేశారు