TEJA NEWS

నిండు పార్లమెంటరీ సమక్షంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ని అవమానించడం చాలా బాధాకరం — కూన శ్రీశైలం గౌడ్

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా పరిధిలోని తూంకుంట మందాయపల్లి అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసిన అనంతరం కూన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ పార్లమెంటరీ సమావేశాలలో కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా భారత రాజ్యాంగ రూపకర్త అంబేద్కర్ ని అవమానించిన విధానాన్ని తీవ్రంగా ఖండించడం జరిగింది…

అనంతరం మేడ్చల్ మల్కాజిగిరి కలెక్టర్ ని కలిసి వినతి పత్రం అందజేస్తూ కేంద్ర మంత్రి అమిత్ షా పై తగిన చర్యలు తీసుకోవాలని కూన శ్రీశైలం గౌడ్ కోరడం జరిగింది..

ఈ కార్యక్రమంలో మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు హరివర్ధన్ రెడ్డి, ఇంచార్జ్ జంగయ్య యాదవ్, పరమేశ్వర్ రెడ్డి, భూపతి రెడ్డి, చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి, యువజన నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు..


TEJA NEWS