
నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో భక్తులకు త్రాగునీరు, మజ్జిగ పంపిణీ
మజ్జిగ పంపిణీ చేసిన ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ ఎన్.మౌర్య
తిరుపతి తాతయ్యగుంట గంగమ్మ జాతరకు విచ్చేసే భక్తుల కొరకు నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన త్రాగునీటి సరఫరా కేంద్రాలలో
ఎమ్మెల్యే ఆరణి శ్రీనివాసులు, కమిషనర్ ఎన్.మౌర్య భక్తులకు మజ్జిగ పంపిణీ చేశారు. ఆలయంలో భక్తుల కొరకు చేసిన ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జాతరకు విచ్చేసే భక్తులకు త్రాగునీరు, మజ్జిగ నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో పంపిణీ చేస్తున్నామని అన్నారు. గంగమ్మ తల్లి దర్శనానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులూ లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని అన్నారు. జాతర, విశ్వరూప దర్శనం రోజు భక్తులు ఎక్కువ సంఖ్యలో రానుండడంతో గ్యాలరీలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. మంగళవారం జాతర రోజు, విశ్వరూప దర్శనం రోజు ఎవరెవరు ఎక్కడ ఉండాలి, ఎంతమంది స్టేజ్ పైన ఉండాలి, తదితర విషయాలపై ఉత్సవ కమిటీ, ఆలయ అధికారులు, పోలీసు అధికారులతో చర్చించామని అన్నారు. కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పిస్తున్నామని అన్నారు.
ప్రథమ చికిత్సా కేంద్రం కూడా ఏర్పాటు చేశామని అన్నారు. భక్తులు అమ్మవారిని సంతోషంగా దర్శించుకునేలా అన్ని ఏర్పాట్లు చేశామని, ఎక్కడా తొందర పడకుండా ఓపిగ్గా అందరూ దర్శనం చేసుకోవాలని భక్తులకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ ఆర్.సి.మునికృష్ణ, డీఎస్పీ భక్తవత్సలం, సూపరింటెండెంట్ శ్యాంసుందర్, మునిసిపల్ ఇంజినీర్ తులసి కుమార్, ఆర్. ఓ. సేతుమాధవ్, ఆలయ ఈవో జయకుమార్, హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్, డీసీపీ మహాపాత్ర, ఉత్సవ కమిటీ సభ్యులు, తదితరులు ఉన్నారు.
