దుండిగల్ మున్సిపాలిటీ అభవృద్దే లక్ష్యం: పురపాలక చైర్ పర్సన్ శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ..
ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గం దుందిగల్ మునిసిపాలిటీ కార్యాలయంలో పురపాలక చైర్-పర్సన్ శ్రీమతి శంభీపూర్ క్రిష్ణవేణి క్రిష్ణ అద్యక్షతన సాధారణ సర్వ సభ సమావేశంను కౌన్సిల్ హాల్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దుందిగల్ మున్సిపల్ అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తూ ఉన్నామన్నారు. దుందిగల్ మునిసిపల్ ప్రాంతాన్ని కౌన్సిల్ సహకారంతో ఎంతో అభివృద్ధి చేశామని మరింత అభివృద్ధి చేయవలసిన అవసరం ఉందని, పెండింగ్ పనులు త్వరితగతిన పూర్తి చేయుటకు కౌన్సిల్ సభ్యులతో పాటుగా ప్రజల భాగస్వామ్యం అవసరమన్నారు. మున్సిపల్ అభివృద్ధిలో శక్తివంతన లేకుండా కృషి చేస్తామని ప్రజల ఆశీర్వాదంతో ముందుకు సాగడం జరుగుతుందన్నారు. ప్రజలు వ్యక్తిగత పరిశుభ్రతతో పాటు పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు…
అనంతరం నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఆర్.వో. ప్రభాకర్ ని కౌన్సిల్ సభ్యులు సన్మానించారు.. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ పద్మారావు, ఎమార్వో మతీన్, కమీషనర్ కల్వకుంట్ల సత్యనారాయణ, కౌన్సిలర్లు శంభీపూర్ క్రిష్ణ, కుంటి అరుణ నాగరాజు, అమరం గోపాల్ రెడ్డి, జక్కుల క్రిష్ణ యాదవ్, జక్కుల విజయ శ్రీనివాస్ యాదవ్, ఆనంద్ కుమార్, సాయి యాదవ్, మహేందర్ యాదవ్, శివానురి నవనీత మల్లేష్, ఎల్లుగారి సత్యనారాయణ, భారత్ కుమార్, పీసరి బాలమని క్రిష్ణ రెడ్డి, మౌనిక విష్ణు వర్ధన్ రెడ్డి, మాదాస్ వెంకటేష్, కొర్ర శంకర్ నాయక్, జోస్ఫిన్ సుధాకర్ రెడ్డి, ఏ.ఈ.సురేందర్ నాయక్, మేనేజర్ సునంద, ఆర్.వో. ప్రభాకర్, మరియు మునిసిపల్, ఇరిగేషన్, రెవెన్యూ, తదితర సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు….