TEJA NEWS

దేశం క్లిష్ట పరిస్థితులలో ఉన్న సమయంలో ఆర్ధిక సంస్కరణలు తీసుకొచ్చి అభివృద్ధి పథంలోకి తీసుకొచ్చిన గొప్ప నాయకుడు, పాలనాదక్షుడు PV నర్సింహా రావు అని మాజీమంత్రి, సనత్ నగర్ MLA తలసాని శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. మాజీ ప్రధానమంత్రి PV నర్సింహా రావు 20 వ వర్ధంతి సందర్బంగా నెక్లెస్ రోడ్డులోని PV ఘాట్ ను సందర్శించి ఆయన సమాధి వద్ద నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన ఏకైక తెలుగు వ్యక్తి PV నర్సింహారావు అని అన్నారు. తన పాలనా తీరుతో దేశాన్ని అన్ని రంగాలలో అభివృద్దిలోకి తీసుకొచ్చి ప్రపంచ దేశాలకు మన దేశాన్ని ఆదర్శంగా నిలిపారని గుర్తుచేశారు. తన సంస్కరణలతో దేశ ఆర్ధిక భద్రత కల్పించారని వివరించారు. 17 భాషలలో అనర్గళంగా మాట్లాడగలిగే బహుభాషా కోవిదుడుగా, రాజనీతిజ్ఞుడు గా గుర్తింపు పొందిన గొప్ప వ్యక్తి PV నర్సింహారావు అని చెప్పారు. దేశానికి విశేష సేవలను అందించిన సేవలకు గుర్తింపు గా ముఖ్యమంత్రిగా KCR నాయకత్వంలోని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనేక కార్యక్రమాలను నిర్వహించిన విషయాన్ని గుర్తుచేశారు.

నెక్లెస్ రోడ్డుకు PV మార్గ్ గా నామకరణం చేయడంతో పాటు ఇదే మార్గంలో విగ్రహాన్ని కూడా ఏర్పాటు చేసిన విషయాన్ని వివరించారు. అదేవిధంగా వెటర్నరీ యూనివర్సిటీ ని కూడా PV నరసింహరావు పేరు తో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. దేశానికి విశేషమైన సేవలను అందించిన PV నర్సింహారావు కి భారతరత్న ఇవ్వాలని కేంద్రప్రభుత్వాన్ని తెలంగాణ ప్రభుత్వం అనేక మార్లు డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తుచేశారు. కేంద్రప్రభుత్వం PV నర్సింహారావు కు ఎంతో ప్రతిష్టాత్మకమైన భారతరత్న ఇవ్వడం ఆయన దేశానికి అందించిన సేవలకు లభించిన సముచిత గౌరవం అన్నారు. PV నరసింహారావు జయంతి, వర్ధంతి లను ఒక్క తెలుగు రాష్ట్రాలలోనే కాకుండా దేశంలోని అన్ని ప్రాంతాలలో నిర్వహించుకోవడం జరుగుతుందని అన్నారు. MLA వెంట BRS పార్టీ రాంగోపాల్ పేట, బేగంపేట డివిజన్ అద్యక్షులు అత్తిలి శ్రీనివాస్ గౌడ్, శ్రీనివాస్ గౌడ్, నాయకులు శేఖర్, శ్రీహరి, మహేందర్, ఆరీఫ్, కోటేశ్వర్ గౌడ్, గణేష్ తదితరులు ఉన్నారు.


TEJA NEWS