
మహేష్ బాబుకు ఈడీ నోటీసులు
ఏప్రిల్ 27 న విచారణకు హాజరు కావాలని ఆదేశం
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలైన సురానా డెవలపర్స్, సాయి సూర్య డెవలపర్స్ పై జరిగిన ఈడీ రైడ్స్ లో ఆధారాలను సేకరించిన అధికారులు
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ కంపెనీలకు చేసిన వాణిజ్య ప్రకటనలకు మహేష్ బాబు రూ.5.9 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్టు ఆరోపిస్తున్న ఈడీ అధికారులు
అందులో రూ.2.5 కోట్లు మనీ లాండరింగ్ ద్వారా అక్రమ పద్ధతిలో తీసుకున్నట్టు ఈడీ అధికారులకు ఆధారాలు లభించాయి
మహేష్ బాబు చేసిన ప్రకటనలను చూసి, ఈ రియల్ ఎస్టేట్ సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయి అని తెలియక అనేకమంది పెట్టుబడులు పెట్టారని ఈడీ అధికారులు పేర్కొన్నారు
రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలలో ఎలాంటి భాగస్వామ్యం లేనప్పటికీ, డబ్బును అక్రమమైన పద్ధతిలో స్వీకరించినందుకు మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు
