గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు కృషి.
సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేసిన శాసనసభ్యులు కృష్ణప్రసాదు .
ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ రూరల్,
గొల్లపూడిలో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక శ్రద్ధతో కృషి చేస్తునట్లు మైలవరం శాసనసభ్యులు వసంత వెంకట కృష్ణప్రసాదు పేర్కొన్నారు. విజయవాడ రూరల్ మండలంలోని గొల్లపూడి రామరాజ్యనగర్, అట్కిన్ సన్ స్కూల్ ఏరియాలో సిమెంట్ రహదారుల నిర్మాణానికి శాసనసభ్యులు కృష్ణప్రసాదు శంకుస్థాపన చేశారు. ఆయన మాట్లాడుతూ ఎన్డీఏ మహాకూటమి ప్రభుత్వ పాలనలో పల్లెలు ప్రగతి బాట పడుతున్నాయన్నారు. గత ప్రభుత్వ విధ్వంస పాలనలో రహదారుల అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోలేదన్నారు. దాని కారణంగా గ్రామాల్లో మౌలిక సదుపాయాలు లేక ప్రజలు నానా అవస్థలు పడ్డారన్నారు.
కానీ నేటి కూటమి ప్రభుత్వం గ్రామాల్లో అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇస్తోందన్నారు. నిధుల సౌలభ్యత, సమస్యల తీవ్రతను బట్టి అభివృద్ధి పనులకు నిధులు కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. ఏపీ సమగ్రాభివృద్ధికి కృషి చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు కి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కృష్ణప్రసాదు కి స్థానిక నాయకులు ఘన స్వాగతం పలికారు. ఎన్డీఏ కూటమి నాయకులు తదితరులు పాల్గొన్నారు.