లింగపాలెం మండలం, కొత్తపల్లికి వరాల జల్లు కురిపించిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్.
లింగపాలెం, : చింతలపూడి నియోజకవర్గ పరిధిలోని లింగపాలెం మండలం, కొత్తపల్లి గ్రామానికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వరాల జల్లు కురిపించారు. కొత్తపల్లిలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పర్యటించారు. కొత్తపల్లి కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరిగిన విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమంలో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ నిర్వాహకులు, అధికారులు, కూటమి నాయకులు ఎంపీ కి ఘన స్వాగతం పలికారు. ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అమ్మవారిని దర్శించుకుని భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. అనంతరం గ్రామంలో పర్యటించి, ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా స్థానికు ప్రజలు రహదారులను అభివృద్ధి చేయాలని, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు విజ్ఞప్తి చేశారు.
ప్రజల సమస్యలు సావధానంగా విన్న ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సమస్యల పరిష్కారానికి తనవంతుగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కొత్తపల్లి గ్రామంలో రహదారుల అభివృద్ధికి, కమ్యూనిటీ హాల్ నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేస్తానని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ స్థానిక ప్రజలకు హామీ ఇచ్చారు. కొత్తపల్లి గ్రామంలో అటవీ భూములు సాగు చేసుకుంటున్న పేదలను ఇబ్బందులకు గురి చేయవద్దని, నిబంధనలకు లోబడి వ్యవహరించాలని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అటవీ శాఖ డీఎఫ్ఓ, రేంజ్ అధికారికి ఫోన్ చేసి తెలియజేశారు. కొత్తపల్లి గ్రామ పర్యటన సందర్భంగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వరాల జల్లు కురిపించడంతో గ్రామస్తులు హర్షాతిరేకాల ద్వారా తమ ఆనందం వ్యక్తం చేశారు. అడిగిన వెంటనే స్పందించిన ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు. అనంతరం ఎంపీ పుట్టా మహేష్ కుమార్ రంగాపురం సత్యనారాయణ స్వామిని దర్శించుకున్నారు. ఈ సంధర్బంగా ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
ఇట్లు
ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కార్యాలయం,
ఏలూరు.
ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కవర్ చేయవలసిందిగా కోరుచున్నాము.