
ప్రమాదవశాత్తు బావిలో పడి ఉపాధి హామీ కూలీ మృతి.._
వనపర్తి జిల్లా కొత్తకోట మండల పరిధిలోని
నాటవెళ్లి గ్రామ శివారులో రోజువారీ ఉపాధి హామీ పనులకు వెళ్తూ బోయ పద్మ(45)అనే మహిళ ఉపాధి కూలి ప్రమాదవశాత్తు బావిలో పడి మృతి చెందింది.
అధికారులు పోలీసులు ఉపాధి కూలీలు తెలిపినా వివరాల ప్రకారం రోజు మాదిరిగానే బుధవారం ఉపాధిపనులు ప్రారంభించగా ఆమె ఎప్పటిలాగే ఉపాధి కూలీకి వచ్చిందని ,ఉపాధి కూలీల కోసం రోజు మాదిరిగానే టెంట్,వాటర్ ఏర్పాటు చేసినా, వాటర్ వేడి కావడంతో తోటి కూలీల కోసంతాగడానికి నీళ్లు తీసుకురావడానికి బావి దగ్గరకు వెళ్ళిందిని ఆ బావిలోకి దిగుతుండగా కాళ్ళు జారి ప్రమాదవశాత్తుబావిలో పడిందిని కాసేపటికి ఇంకా తిరిగి రాకపోయేసరికి అనుమానం వచ్చిన తోటి కూలీలు బావి దగ్గరికి వచ్చి చూడగా నీళ్ళల్లో తెలాడుతుందని తెలిపారు విషయాన్ని కొత్తకోట పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు అక్కడికి చేరుకొని బావిలోంచి బయటికి తీయగా అప్పటికే మృతి చెందిందని మృతదేహాన్ని వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు అప్పజెప్పినట్లు కొత్తకోట ఎస్సై ఆనంద్ తెలిపారు ఈ విషయాన్ని మండల అధ్యక్షుడు నాగారపు బీచుపల్లి అధికారులతో మాట్లాడి వారి కుటుంబ సభ్యులను ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు..
