TEJA NEWS

వనపర్తికి ఈఎస్ఐ (ESI) ఆస్పత్రికార్మికులను కడుపులో పెట్టి చూసుకుంటున్న కాంగ్రెస్ ప్రభుత్వం_

వనపర్తి మున్సిపల్ కార్మికులను సన్మానించిన ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి
వనపర్తి
వనపర్తి నియోజకవర్గ పరిధిలోని కార్మికులకు వైద్య సేవలు అందించేందుకు త్వరలోనే వనపర్తి జిల్లా కేంద్రంలో ESI ఆసుపత్రిని ఏర్పాటు చేయనున్నట్లు వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘారెడ్డి పేర్కొన్నారు

మే డే…కార్మిక దినోత్సవ సందర్భంగా గురువారం వనపర్తి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే మున్సిపల్ కార్మికులను శాలువల తో సన్మానించారు

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దినదినాభివృద్ధి చెందుతున్న వనపర్తి పట్టణంలో లక్షలాదిమందికి నిరంతరాయంగా సేవలందిస్తున్న మున్సిపల్ కార్మికుల సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు

సిబ్బంది కొరత తీర్చేందుకు కొత్త నియమకాలను చేపడతామని ఎమ్మెల్యే పేర్కొన్నారు

మున్సిపల్ చట్టం ప్రకారం కార్మికులకు అందించే ప్రతి బెనిఫిట్ ను అందేలా చూస్తామని ఎమ్మెల్యే సూచించారు

అనంతరం వనపర్తి పట్టణం బసవన్నగడ్డ లో లైట్ మోటార్ వెహికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్మిక దినోత్సవ కార్యక్రమానికి ఎమ్మెల్యే హాజరై ఆటో యూనియన్, ట్రాక్టర్స్ యూనియన్, కార్మికులకు కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు

కార్యక్రమంలో కమిషనర్, కార్యాలయ సిబ్బంది, వనపర్తి కాంగ్రెస్ పార్టీ పట్టణాద్యక్షులు మాజీ మున్సిపల్ చైర్మన్ పుట్టపాకుల మహేష్, మాజీ కౌన్సిలర్లు, లైట్ మరియు హెవీ వెహికల్స్ సంఘం అధ్యక్షులు అయూబ్ ఖాన్, కార్మికులు తదితరులు పాల్గొన్నారు