TEJA NEWS

ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో సావిత్రిబాయి పూలే జీవిత చరిత్ర పై వ్యాసరచన పోటీలు

ఖమ్మం : వీరనారి సావిత్రిబాయి పూలే మహిళా సంఘం ఆధ్వర్యంలో నగరం లోని ప్రభుత్వ మహిళా డిగ్రీ మరియు పీజీ కళాశాలలో తెలుగు విభాగం వారి సహకారంతో బోటనీ లెక్చరర్ కృష్ణవేణి ఆధ్వర్యంలో భారతదేశ ప్రథమ మహిళా ఉపాధ్యాయుని సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రపై వ్యాసరచన పోటీలు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మహిళా సంఘం అధ్యక్షురాలు పి.ఆర్.దేవి మరియు తెలుగు విభాగం ప్రొఫెసర్ Dr జూపూడి మార్జియాన హాజరైనారు . ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సావిత్రిబాయి పూలే మహిళా లోకానికి ఎనలేని సేవ చేశారని అటువంటి గొప్ప మహిళా మూర్తి జీవిత చరిత్రను వ్యాసాలుగా రాయడానికి విద్యార్థులు ముందుకు రావాలని ఇలాంటి సామాజిక ఉద్యమకారుల జీవిత చరిత్ర రాయడానికి వచ్చినటువంటి విద్యార్థిని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు . కళాశాల అధ్యాపక బృందానికి ధన్యవాదాలు తెలిపారు . ఈ కార్యక్రమంలో మహిళా సంఘం ఉపాధ్యక్షురాలు అనంతలక్ష్మి , మణి , సహాయ కార్యదర్శి ఇ.నాగలక్ష్మి , రమ్య , కళాశాల లెక్చరర్స్ కె ఇందిరా (ఎకనామిక్స్ ) , Dr. N పద్మావతి (ఇంగ్లీష్ ) , Dr. కె పద్మారాణి (హిందీ ) , సి ఎహె శ్రీనివాస్ (తెలుగు) , పి.శ్రీనివాస్ (తెలుగు) మరియు విద్యార్థులు పాల్గొన్నారు .


TEJA NEWS