TEJA NEWS

కొత్త చట్టాలపై అవగాహన ఉండాలి: ఎస్సై శ్రీనివాస్ రావు

కేటీ దొడ్డి:- ఇటీవల ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చట్టాలపై కనీస అవగాహన ఎంతైనా అవసరమని కేటీ దొడ్డి మండల ప్రజలకు స్టానిక ఎస్సై శ్రీనివాస్ రావు తెలియజేసారు.మంగళవారం తన కార్యాలయం నుండి ఒక ప్రకటన ద్వారా కొత్త చట్టాల గురించి వివరించారు.కొత్త చట్టాలు 2024 జూలై 1 నుంచి అమలులోకి వచ్చాయని ఆయన పేర్కొన్నారు. ఇండియన్ పీనల్ కోడ్ 1860 ఇప్పుడు భారతీయ న్యాయ సంహితగా మార్పు చేయబడిందని, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ -1973 ఇప్పుడు భారతీయ నాగరిక్ సురక్ష, భారత సాక్షా చట్టం 1872 ఇప్పుడు భారతీయ సాక్ష్య ఆధునియ, బాధితులకు ప్రభావంతమైన సహాయం, అందించడం, నేరాన్ని సులభంగా నీవేదించడం, నిర్దిష్ట కాలవ్యవధిలో దర్యాప్తు పూర్తి కావడం, నిర్దిష్ట కాల వ్యవధిలో విచారణ పూర్తి చేయడం, అందుబాటు,పారదర్శకత, త్వరగా న్యాయం చేయడం, ఎక్కడ నుంచైనా సమర్పించే అవకాశం, మీ ఫిర్యాదు/ కేసు పై పురోగతి పొందడం నిర్దిష్ట కాలవ్యవధిలో ఫిర్యాదు/ కేసు పూర్తి కావడం, విచారణ పురోగతి ఫిర్యాదుదారుడుకి 90 రోజుల్లోపు తెలియజేయ పరచడం, మహిళపై సాగే నేరాలతో పోరాటం, అనగా పెళ్లి పేరుతో మోసపూరితమైన వాగ్దానం ఉండదు. బాధిత మహిళకు ఉచిత వైద్య సదుపాయం కల్పించడం. బాధిత మహిళా గురించి వ్యక్తిగత సమాచారం వెల్లడించకుండా ఉండటం. ఆన్లైన్లో వాగ్మూలం నమోదు చేయడం, నేర సమాచారాన్ని ఎక్కడ నుంచైనా నివేదించడం, సాక్షికి భద్రత కల్పించే పథకం 2024 జులై 1 నుంచి వర్తిస్తాయని ఆయన పేర్కొన్నారు.అదేవిధంగా,33 రకాల వివిధ నేరాలకు పెరిగిన కఠిన శిక్షలు, కొన్ని కేసులలో శిక్షలుగా సామాజిక సేవలు,83 రకాల వివిధ నేరాలకు పెరిగిన జరిమానాలు విధించడం, 23 రకాల వివిధ నేరాలకు తప్పనిసరి కనీస శిక్షణ వేయడం లాంటివి జరుగుతాయని ఎస్ఐ శ్రీనివాస్ రావు వివరించారు.


TEJA NEWS