TEJA NEWS

124 ఆల్విన్ కాలనీ డివిజన్ పరిధిలోని PJR నగర్ లో రూ. 2 కోట్ల రూపాయల అంచనావ్యయంతో నూతనంగా నిర్మిస్తున్న మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులను డివిజన్ కార్పొరేటర్ దొడ్ల వెంకటేష్ గౌడ్ జి.ఎచ్.ఎం.సి అధికారులతో కలిసి పరిశీలించడం జరిగింది.

ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ పీజేఆర్ నగర్ కాలనీలో నిర్మిస్తున్న మల్టి పర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణ పనులలో భాగంగా స్లాబు నిర్మాణం పూర్తయిందని అన్నారు. స్లాబును మంచిగా క్యూరింగ్ చేయించాలని అధికారులకు తెలియచేసారు. పీజేఆర్ నగర్ కాలనీ వాసుల చిరకాల కోరిక త్వరలోనే నెరవేరుతుంది అని, అందరికి ఆమోదయోగ్యమైన ఫంక్షన్ హాల్ ను అన్ని హంగుల తో సకల సౌకర్యాల తో నిర్మిస్తామని కార్పొరేటర్ గారు తెలియచేసారు. ఫంక్షన్ హల్ పేద మధ్య తరగతి ప్రజలకు ఇక్కడి పరిసర ప్రాంత ప్రజలకు ఎంతగానో ఉపయోగపడుతుంది అని తెలియచేసారు. ఫంక్షన్ హల్ లో వివాహాది శుభకార్యాలు, సమావేశాలు, సభలు, చిన్న చిన్న ఫంక్షన్ లు జన్మదిన వేడుకలు నిర్వహించుకునేందుకు వీలుగా ఫంక్షన్ హాల్ ఉపయోగపడుతుంది అని అన్నారు. ఫంక్షన్ హాల్ మరియు చిల్డ్రన్ పార్క్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేయాలని, నాణ్యత ప్రమాణాలతో చేపట్టి ప్రజలకు త్వరలోనే అందుబాటులో కి తీసుకురావాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎ.ఇ శ్రావణి, వర్క్ ఇన్స్పెక్టర్ రవి కుమార్, పోశెట్టిగౌడ్, యాదగిరి, అగ్రవాసు, ముజీబ్, మహేష్, రవీందర్, మల్లేష్, తదితరులు పాల్గొన్నారు.