Spread the love

ప్రతి ఒక్కరూ మన పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి

స్వఛ్ఛ ఆంధ్ర – స్వఛ్ఛ దివస్ సందర్భంగా రాజుపాళెంలో భారీ మానవహారం.

స్థానిక మహిళలతో కలిసి ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి.

మన ఇంటిని పరిశుభ్రంగా వుంచుకున్నట్టే పరిసరాల పరిశుభ్రతపై కూడా శ్రధ్ధ చూపాలని పిలుపునిచ్చారు కోవూరు ప్రశాంతి రెడ్డి. స్వఛ్ఛ ఆంధ్ర – స్వఛ్ఛ దివస్ సందర్భంగా కొడవలూరు మండలం రాజుపాళెంలో అధికారులు, నాయకులు, కార్యకర్తలు నిర్వహించిన భారీ ర్యాలీలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్థానికంగా ఉన్న అంబేడ్కర్‌ విగ్రహానికి పూలమాలవేసి ప్రజలతో కలిసి స్వచ్ఛ ఆంధ్ర, స్వచ్ఛ దివస్ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం భారీ మానవ హారంగా ఏర్పడి పరిసరాల పరిశుభ్రతకు సంబంధించి ప్రతిజ్ఞ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల మూడవ శనివారం స్వఛ్ఛ ఆంధ్ర – స్వఛ్ఛ దివస్ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు భాగస్వాములై పరిశుభ్రత కోసం పాటుపడాల్సిన అవసరం ఉందన్నారు. దైనందిన జీవితంలో స్వచ్ఛతను ఒక అలవాటుగా మార్చుకోవాలని పరిశుభ్రత ప్రతి ఒక్కరి జీవితంలో భాగం కావాలన్నారు,పరిశుభ్రత అనేది ఒక రోజుతో అయిపోయే కార్యక్రమం కాదని, ప్రజలందరి భాగస్వామ్యంతోనే స్వచ్ఛ ఆంధ్ర సాకారమవుతోందన్నారు,

పరిసరాల పరిశుభ్రత యొక్క ఆవశ్యకత తెలియచేస్తూ ప్రజలకు అవగాహన కల్పించడంలో మీడియా పాత్ర కీలకమన్నారు,మన ఇంటిని, మన ఊరిని, మన గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుకునేందుకు ప్రతి నెలలో మూడో శనివారంనాడు ప్రత్యేకంగా కొన్ని గంటలు కేటాయిస్తే స్వఛ్ఛ ఆంధ్ర ప్రదేశ్ సాధ్యమవుతుందన్నారు. ప్రజలందరి భాగస్వామ్యం ఉండేలా మీడియా కూడా చొరవ చూపాలన్నారు,పరిశుభ్రత ఎక్కడ ఉంటే ఆరోగ్యం అక్కడ ఉంటుంది,ఆరోగ్యం ఉన్న చోట సంతోషం, సంపద రెండూ ఉంటాయన్నారు స్వచ్ఛతను ఒక అలవాటుగా మార్చుకోవాలని, ముఖ్యంగా పరిసరాల పరిశుభ్రతపై మహిళలు చొరవ తీసుకోవాలని కోరారు,అనంతరం స్థానిక సమస్యలపై ప్రజలనించి వినతి పత్రాలు స్వీకరించిన పెన్షన్లు, ఇళ్ల స్థలాలకు సంబంధించి స్థానిక సచివాలయాలలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ జిల్లా గ్రంధాలయ అధ్యక్షుడు మందపాటి ప్రవీణ్ కుమార్ రెడ్డి, కరకట మల్లికార్జున్, బెజవాడ వంశీ కృష్ణ రెడ్డి, ఎస్ సి తువ్వూరు ప్రవీణ్ కుమార్, మందపాటి రమణారెడ్డి, సిద్దార్ధ, కిరణ్, యకశిరి వెంకట రమణమ్మ,తదితరులు పాల్గొన్నారు.