TEJA NEWS

జమాఅతె ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షులు జైనుల్ పాషా

…..

ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్ సాక్షిత

రాజ్యాంగం మనకు కల్పించిన ఓటు హక్కును రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో సద్వినియోగం చేసుకోవ్వాలని జమాఅతె ఇస్లామీ హింద్ జిల్లా అధ్యక్షులు జైనుల్ పాషా ఒక ప్రకటనలో తెలియచేశారు ప్రజాస్వామ్యంలో అతి ముఖ్యమైన భాధ్యత ప్రతి ఒక్క ఓటరు భాధ్యత తో తమ ఓటు హక్కును వినియోగించుకుని , భవిష్యత్తు తరాలకు ఆదర్శంగా నిలవాలని ఈ సారి జరిగే ఎన్నికల్లో పోలింగ్ శాతాన్ని పెంచడంలో ప్రతి ఒక్క ఓటరు కృషి చేయాలని అన్నారు. నేటి పరిస్థితుల్లో దేశంలో రాజకీయ మార్పు చాలా అవసరమని, ఫాసిస్టు శక్తులను గద్దెదించడానికి ఇదే చివరి అవకాశమన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరూ తమ నిర్లక్ష్యాన్ని వీడి పోలింగ్ రోజు ఓటు వేయాలన్నారు. ఓటు వేయడం సామాజిక, నైతిక బాధ్యతగా భావించాల న్నారు.

ఓటు వేయకుండా నిర్లక్ష్యం చేసి మీ ఓటును వృధాచేసుకోవద్దని అన్నారు. ఓటు వేయడానికి అవసరమైన పోలింగ్ స్లిప్, గుర్తింపు కార్డు తదితర పత్రా లను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. ఓటింగ్ ప్రక్రియ, పోలింగ్ బూత్ స్థానాన్ని ముందుగానే తెలుసుకోవాలన్నారు. మీ కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులకు ఓటు ప్రాముఖ్యత గురించి అవగాహన కల్పించాలని చెప్పారు. రాజ్యాంగం కల్పించిన హక్కుల ను కూడా రద్దు చేసేందుకు కుట్రలు పన్ను తున్నారని ఆయన అన్నారు.. ఇలాంటి పరిస్థితుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే భవిష్యత్లో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి ఉంటుందని అన్నారు. పోలింగ్ రోజును సెలవు దినంగా పరిగణించవద్దని, ఉదయాన్నే ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన అన్నారు. నిరంకుశ, అణచివేత శక్తులను అడ్డుకునేందుకు ఓటును ఆయుధంగా వాడుకోవాలున్నారు.


TEJA NEWS