TEJA NEWS

అర్హులైన ప్రతి ఒక్కరూ కల్యాణ లక్ష్మీ పథకాన్ని వినియోగించుకోవాలి : ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ….

సాక్షిత : కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమంలో భాగంగా కుత్బుల్లాపూర్ మండల రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ ముఖ్యఅతిథిగా హాజరై 372 మంది లబ్ధిదారులకు కల్యాణ లక్ష్మీ చెక్కులను పంపిణీ చేశారు.

ఈ సంధర్బంగా ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ మాట్లాడుతూ ఆడపిల్లల పెళ్లి పుట్టినింటి వారికి భారం కాకూడదని ప్రభుత్వం అందజేస్తున్న కల్యాణ లక్ష్మీ / షాది ముబారక్ పథకాన్ని అర్హులైన ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాలని ఎమ్మెల్యే కెపి.వివేకానంద్ అన్నారు.

ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో అబ్దుల్ రెహమాన్ ఖాన్, డిప్యూటీ తహసీల్దార్ మల్లికార్జున్, ఆర్ఐ విజయ్, ఖలీం తదితరులు పాల్గొన్నారు.


TEJA NEWS