TEJA NEWS

Investigation on former MLA Pinnelli's bail petition of Machar.. Excitement on the court verdict.

మాచర్ల మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి బెయిల్ పిటిషన్‎పై విచారణ.. కోర్టు తీర్పుపై ఉత్కంఠ..

పల్నాడు జిల్లా…
వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి బెయిల్‌ పిటిషన్‌పై ఇవాళ మరోసారి విచారణ జరగనుంది.

గత విచారణలో ఇవాళ్టి వరకు మధ్యంతర ముందస్తు బెయిల్ పొడిగించింది హైకోర్టు.

ఈవీఎం ధ్వంసంతో పాటు మరో మూడు కేసుల్లో మధ్యంతర బెయిల్‌పై ఇవాళ హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.

ఎన్నికలకు ముందు, తర్వాత జరిగిన గొడవల్లో వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి పై మొత్తంగా 4 కేసులు నమోదయ్యాయి.

EVM ధ్వంసం కేసులో A1గా ఉన్నారు పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి. కాగా గతంలో టీడీపీ రిలీజ్ చేసిన వీడియోనే ఆధారంగా చూపుతున్నారని పిన్నెల్లి లాయర్‌ హైకోర్టు ముందు తమ వాదనలు వినిపించారు.

ఆ వాదనలతో ఏకీభవించిన హైకోర్టు పిన్నెలికి మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది.

దీంతో ఆయన ఇప్పటి వరకు మధ్యంతర బెయిల్ పై బయట ఉన్నారు.

పల్నాడు జిల్లాలోని మాజీ మంత్రి అనీల్ కుమార్ యాదవ్ నివాసంలో బస చేస్తున్నారు.

అయితే ఈ రోజు కోర్టుకు హాజరుపర్చాల్సి ఉండగా ఎలాంటి ఆదేశాలు వెలువడుతాయోనన్న ఉత్కంఠ చాలా మందిలో నెలకొంది.


TEJA NEWS