టి.జి.ఎస్.ఆర్.టి.సి లాజిస్టిక్ సేవల విస్తరణ
…..
సాక్షిత,ఉమ్మడి ఖమ్మం బ్యూరో చీఫ్:
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇప్పటివరకు బస్టాండ్ లకే పరిమితమైన లాజిస్టిక్ సేవలను గత నెల రోజులలో ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని మండల, గ్రామీణ ప్రాంతాలకు విస్తరించడం జరిగిందని లాజిస్టిక్స్ ఏ.టీ.ఎం.ఏ. పవన్ కుమార్ ఒక ప్రకటనలో తెలియజేశారు.
లాజిస్టిక్స్ వినియోగదారులందరకు శరణ్ దేవి నవరాత్రులు మరియు దసరా పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తూ
టీ.జీ.ఎస్.ఆర్టీసీ లాజిస్టిక్స్ లో అతి తక్కువ ధరలలో బుక్ చేసుకుని వేగంగా,భద్రంగా మీ పార్సెల్ పంపుకోవచ్చని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలోనే కాక ఆంధ్రప్రదేశ్లోని అన్ని ముఖ్యమైన పట్టణాలు మరియు బెంగుళూరు కూడా లాజిస్టిక్ సౌకర్యం కలదని తెలియజేసినారు. ఉమ్మడి ఖమ్మం జిల్లా వ్యాప్తంగా 35 లాజిస్టిక్ కేంద్రాలు అందుబాటులో కలవని తెలియజేసినారు.
బుక్ చేసుకున్న మీ పార్సెల్ గురించి తెలుసుకొనుటకు app.tgsrtclogistics.co.in ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు.
అతి త్వరలో హోమ్ పికప్ మరియు హోం డెలివరీ సేవలను కూడా అందుబాటులోకి తీసుకురానున్నామని తెలిపారు. ముందుగా హైదరాబాద్ నందు ఈ సేవలను ప్రారంభించి తర్వాత అన్ని జిల్లాలకు విస్తరింపజేయనున్నామని తెలియజేసినారు.
ఉమ్మడి ఖమ్మం జిల్లా
టీ.జీ.ఎస్.ఆర్టిసి లాజిస్టిక్స్ సేవల కొరకు సంప్రదించవలసిన ఫోన్ నెంబర్స్ :
ఖమ్మం :9154298583
మదిర :9154298582
సత్తుపల్లి:9154298585
కొత్తగూడెం:9154298587
భద్రాచలం :9154298586
మణుగూరు :9154298588.