TEJA NEWS

కొనుగోలు కేంద్రాలలో నాణ్యమైన ధాన్యం విక్రయించి రైతులు బోనస్ పొందాలి కొనుగోలు కేంద్రాలలో మౌళిక వసతులు ఏర్పాటు చేయాలి…

జిల్లా అదనపు కలెక్టర్ : రాంబాబు

సూర్యాపేట జిల్లా : ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలకు ధాన్యం తేమ శాతం17 ఉండేలా తాలు లేకుండా నాణ్యమైన ధాన్యం తీసుకొనివచ్చి మద్దతు ధర రూ. 2320 పై భోనస్ రూ. 300 పొందాలని జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు అన్నారు.బుధవారం సూర్యాపేట మండలం పరిధిలోని పిల్లలమర్రి, రాజ్ నాయక్ తండా, బాలేంల-1 ధాన్యం కొనుగోలు కేంద్రాలను జిల్లా అదనపు కలెక్టర్ పి రాంబాబు సందర్శించారు. ఈ సందర్బంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలలో త్రాగునీరు, టెంట్ లాంటి మౌళిక వసతులు ఏర్పాటు చేయాలని, గోనె సంచులు తెచ్చుకోవాలని నిర్వాహకులకి సూచించారు.ధాన్యం కొనుగోలు కేంద్రాలకి వచ్చిన ప్రకారం రైతులకి టోకెన్ లు జారీ చేయాలని వడ్లలో తాలు లేకుండా ఆరబెట్టించి తేమ శాతం 17 రాగానే తూకం వేసి ధాన్యం మిల్లులుకి తరలించాలని సూచించారు.రాజ్ నాయక్ తండా కొనుగోలు కేంద్రంలో వడ్లను ఆరబెట్టేందుకు ట్రాక్టర్ ని ఉపయోగిస్తున్నండంగా అదనపు కలెక్టర్ చూసి అలా ట్రాక్టర్ ఉపయోగిస్తే వడ్లు విరిగి బియ్యం, నూకగా మారుతాయని అలా చేయరాదని నిర్వాహకులని అదనపు కలెక్టర్ ఆదేశించారు.ప్రభుత్వం సూచించిన ప్రాంతాలలో మాత్రమే కొనుగోలు కేంద్రాలు నిర్వహించాలని వాటికి ఉప కేంద్రాలు ఏర్పాటు చేయరాదని అదనపు కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమం లో ఆర్ ఐ గోపి, కొనుగోలు కేంద్రాల నిర్వాహకులు వెంకటమ్మ, నాగరాజు, బాలాజీ, దేవి తదితరులు పాల్గొన్నారు.