TEJA NEWS

రైతు సంక్షేమం, భూ సమస్యల పరిష్కారానికి ప్రజా ప్రభుత్వ ముఖ్య లక్ష్యం.

సామాన్యులకు, ప్రజలకు అందుబాటులో భూభారతి నూతన ఆర్ఓఆర్ చట్టం 2025.

మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళి నాయక్.

నూతన చట్టం ప్రకారం దరఖాస్తు చేసుకున్న ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి – చట్టం 25, అవగాహన సదస్సులో మహబూబాబాద్ శాసనసభ్యులు డా భూక్యా మురళీ నాయక్ …


మహబూబాబాద్ నియోజకవర్గం

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూభారతి – చట్టం 25, అవగాహన సదస్సు మంగళవారం భూపతిపేట గ్రామ రైతువేదిక లో మహబూబాబాద్ శాసనసభ్యులు డాక్టర్ భూక్య మురళీ నాయక్, జిల్లా కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ (రెవెన్యూ) కె.వీరబ్రహ్మంచారి, రెవెన్యూ డివిజనల్ అధికారి కృష్ణవేణి, తదితరులు హాజరై తెలంగాణ గీతం ఆలపించి, పిపిటి, చదివి వినిపించి రైతులకు భూ భారతి కొత్త ఆర్ఓఆర్ చట్టం – 2025 పై అవహన కల్పించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ… గత ధరణి పోర్టల్ ద్వారా తాను కూడా స్వయంగా నష్టపోయానని, ప్రభుత్వం సామాన్య రైతులకు, ప్రజలకు న్యాయం జరిగే విధంగా ఉండేందుకు ముఖ్యమంత్రి
ఈ భూభారతి నూతన రెవెన్యూ చట్టం ప్రవేశపెట్టడం జరిగిందని తెలిపారు తద్వారా ప్రతి ఒక్కరికి న్యాయం జరుగుతుందని ఆయన అన్నారు.

గూడూరు మండల పరిధిలోని సీతానాగారం భూ సమస్యల పరిష్కారం నిమిత్తం అవసరమైతే ముఖ్యమంత్రి తో స్వయంగా మాట్లాడతానని ఈ నూతన చట్టం ద్వారా వారికి పక్కాగా న్యాయం జరుగుతుందని అన్నారు.

దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి రైతులు మహిళలకు యువతకు అన్ని వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తుందన్నారు.

ధరణి సమయంలో రెవెన్యూ అధికారులు సామాన్య ప్రజలకు రైతులకు న్యాయం చేయలేక పోయారని ప్రస్తుతం ప్రవేశపెట్టిన ఈ చట్టం ద్వారా అప్పిళ్లు, దరఖాస్తుల స్థితిగతులు వేగంగా సేవలు అందుతాయన్నారు.

ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారిని విజయనిర్మల, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ నరేష్ రెడ్డి, ఏడిఏ శ్రీనివాస్, స్థానిక తహసిల్దార్ ఎంపిడిఓ వీరస్వామి, సంబంధిత అధికారులు, జిల్లా నాయకులు, మండల నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, రైతులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.