పదవ తరగతిలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేలా విద్యార్థినీలను సిద్దం చేయాలని, ఎలాంటి వత్తిడికి గురికాకుండా పరీక్షలు అంటే భయం పోగెట్టెల ఉపాధ్యాయులు వారికి తెలియజేయాలని, ఆ దిశగా ఉపాధ్యాయులు చర్యలు చేపట్టాలని అదనపు కలెక్టర్ డి.మధుసూదన్ నాయక్ తెలిపారు. మంగళవారం ఆయన ఖమ్మం ఆర్భన్ మండలం వెలుగుమట్ల కస్తూరీభా పాఠశాలను ఆకస్మిక తనిఖీ చేశారు. 10వ తరగతిని సందర్శించి, విద్యార్ధుల విద్యా ప్రమాణాలు పరిశీలించారు. వారికి విద్యాబోధన చేసి వారి సందేహాలను నివృత్థి చేశారు. 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్న దృష్ట్యా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహించి విద్యార్ధులను పరీక్షలకు సిద్దం చేయాలన్నారు. వెనుకబడ్డ విద్యార్థులపై ప్రత్యేక దృష్టి పెట్టి, వారి విద్యా ప్రమాణాలు పెరిగేలా కృషి చేయాలన్నారు. పాఠశాలలో ఎంత మంది విద్యార్థులు చదువుతున్నది పరిశీలించారు.
అనంతరం కిచెన్ షెడ్ వంట వస్తవులు, కూరగాయలు, సరుకుల వివరాలు, విద్యార్ధులకు ప్రతిరోజు అందించే మెనూను ఆయన పరిశీలించారు.
కస్తూరీభా విద్యాలయ ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులు ఉన్నారు.
వత్తిడికి గురికాకుండా పరీక్షలు అంటే భయం పోగెట్టెల ఉపాధ్యాయులు వారికి తెలియజేయాలని
Related Posts
కూటమి ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్ద పీట
TEJA NEWS కూటమి ప్రభుత్వంలో గ్రామీణ వ్యవస్థ బలోపేతానికి పెద్ద పీట• పంచాయతీల నిధులను గత ప్రభుత్వం మాదిరి మళ్లించే ప్రసక్తే లేదు• ఏ పంచాయతీ నిధులు ఆ పంచాయతీ అభివృద్ధికి వినియోగం అవ్వాలి• త్వరలో పంచాయతీల ఖాతాలకు 15వ ఆర్ధిక…
రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్
TEJA NEWS రాష్ట్ర సచివాలయంలో డిప్యూటీ సీఎం కొణిదెల పవన్ కల్యాణ్ తో మార్యదపూర్వకంగా సమావేశమవడం జరిగింది. గత కొన్ని రోజులుగా రాష్ట్రంలో జరుగుతున్న పరిణామాలు , హోంశాఖ తీసుకుంటున్న చర్యలను ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. చిన్నారులు,…