TEJA NEWS

రైతులను అగ్రగండంగా దోచుకుంటున్న ఫెర్టిలైజర్, పెస్టిసైడ్స్ & సీడ్స్ వ్యాపార నిర్వాహకులు
రైతులను పీడిస్తున్న పురుగుమందుల షాపు యాజమాన్యం


సాక్షిత సూర్యపేట జిల్లా ప్రతినిధి: ఆరుగాలం పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక ఇప్పటికే అనేక సమస్యలను ఎదుర్కుంటున్న రైతన్నకు బాసటగా నిలవాల్సిందిపోయి రైతుకు గుది బండగా పురుగుమందు షాపుల నిర్వహకులు మారుతున్నారు.
రైతుకు వ్యవసాయ పెట్టుబడులకు ఆర్థిక స్థోమత లేక మందుల షాపులో పురుగు మందులను కొనుగోలు చేసి కొంతమేర విద్దర రూపంలో తెచ్చిన మందులకు వడ్డీలు కలిపి అధిక మొత్తంలో చెల్లించాలని రైతుల నడ్డి విరుస్తున్నారు. దీనికి నిదర్శనం సూర్యాపేట మండల పరిధిలోని టేకుమట్ల, యండ్లపల్లి గ్రామాల్లో ఏర్పాటు చేసుకున్న మందుల షాపుల నిర్వహకులు వ్యవహరిస్తున్నారు. ఈ దోపిడీకి సంబంధిత అధికారులు అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. లేదంటే రైతులు పెరుగు బువ్వకు బదులు పురుగులమందు సేవించి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి మరలా ఈ రాష్ట్రానికి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
తక్షణమే అలాంటి షాపుల లైసెన్సులను రద్దు చేసి సంబంధిత నిర్వహుకులపై చట్టరిత్య చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.


TEJA NEWS