Spread the love

అగ్ని ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయి పరిశీలన

విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర

అగ్ని ప్రమాదాల నివారణకు క్షేత్రస్థాయిలో పరిశీలించారు విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర. కార్మల్ నగర్ లోని సెయింట్ మేరీ విజయ కాన్వెంట్, చుట్టుగుంట లోని మెట్రో హోల్సేల్ మార్ట్ ను సందర్శించి క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అగ్ని ప్రమాదం జరగకుండా ఖచ్చితంగా నివారణ భద్రత ఏర్పాట్లు పటిష్టంగా పాటించాలని, లేనిచో అనుమతులు ఇవ్వబడవని అన్నారు. తానే స్వయంగా సెయింట్ మేరీ విజయ కాన్వెంట్ ను సందర్శించి అక్కడున్న ఫైర్ సేఫ్టీ మేషర్స్ పరిశీలించారు. అగ్ని ప్రమాదం తలత్తిన వెంటనే ఎటువంటి చర్యలు తీసుకోవాలి వంటి అంశాలపై ఫైర్ సిబ్బంది ముందుగానే అవగాహన కల్పించగా, ప్రమాదం జరిగిన వెంటనే ఫైర్ టెక్స్టింగ్గిషేర్ సరైన పద్ధతిలో వాడుతున్నారా లేదా వంటి విషయాలపై పరిశీలించారు.

ప్రమాదం జరిగిన వెంటనే భయభ్రాంతులోకి లోనవ్వకుండా ఎటువంటి చర్యలు తీసుకోవాలి, సిబ్బంది ప్రజలను ఎలా కాపాడాలి వంటి అంశాల పై అక్కడున్న సిబ్బందికి విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఫైర్ ఎగ్జిట్లు ఎన్ని ఉన్నాయి, అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా అగ్ని ప్రమాదక నివారణ చర్యలు పటిష్టంగా పాటిస్తున్నారా లేదా వంటి విషయాలపై క్షుణ్ణంగా ఆరా తీశారుమెట్రో కాంపౌండ్ మొత్తం తిరిగి ఫైర్ ఇంజన్ తిరగటానికి గల ప్రాంతం ఉందా లేదా అని తనఖిచేశారు. అక్కడున్న అగ్ని ని ఆర్పే పరికరాలు స్మోక్ డిటెక్టర్, ఫైర్ స్ప్రింక్లర్, ఈల్డ్ హైడ్రెంట్, తదితర అగ్ని ప్రమాద నివారణ పరికరాలు అన్ని సక్రమంగా ఉన్నాయా లేదా అని పరిశీలించారు. కరెంటు పోయినా ఎమర్జెన్సీ ఎగ్జిట్ కనపడేటట్టు రేడియం స్టిక్కర్లు దారిలో ఉండాలని సూచనలు ఇచ్చారు.

మెట్రో మార్ట్ లో సెట్ బ్యాక్ లో చిన్న లోపాలను గమనించి, ఉన్న లోపాలను అధిగమిస్తేనే నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ను జారీ చేస్తానని మెట్రో మేనేజర్ కు తెలిపారుఈ పర్యటనలో జోనల్ కమిషనర్ ప్రభుదాస్, డిస్ట్రిక్ట్ ఫైర్ ఆఫీసర్ మాల్యాద్రి, రీజినల్ ఫైర్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు, స్టేషన్ ఫైర్ ఆఫీసర్ రాజా, చీఫ్ సిటీ ప్లానర్ జి వి జి ఎస్ వి ప్రసాద్, ఇన్చార్జి చీఫ్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ సురేష్ బాబు, డిప్యూటీ డైరెక్టర్ హార్టికల్చర్ రామ్మోహన్, ప్రాజెక్ట్ ఆఫీసర్ (యు సి డి) పి వెంకటనారాయణ, సూపరిండెంటింగ్ ఇంజనీర్లు పి సత్యనారాయణ, పి సత్యకుమారి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు సామ్రాజ్యం, శ్రీనివాస్ రెడ్డి, అసిస్టెంట్ మెడికల్ హెల్త్ ఆఫీసర్ గోపి నాయక్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ మోహన్ బాబు, తదితరులు పాల్గొన్నారు